Amitabh Bachchan : బన్నీ గొప్పదనం చెప్పిన అమితాబ్.. చెప్పు వదిలేసినా వైరలవ్వడం తొలిసారి అంటూ?

టాలీవుడ్ దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా పుష్ప( Pushpa ) ఈ సినిమా 2021 లో విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.

పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.

అంతేకాకుండా ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం తెలిసిందే.ఈ సినిమాలో నటనకు గాను ఉత్తమ నటుడిగా కూడా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్.

ఇకపోతే ప్రస్తుతం అల్లు అర్జున్ ( Allu Arjun )పుష్ప 2 సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఇకపోతే తాజాగా ఈ సినిమాలోని పాట గురించి తాజాగా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

కాగా అమితాబ్ బచ్చన్ ( Amitabh Bachchan )ఎన్నో ఏళ్లుగా కౌన్ బనేగా కరోడ్‌పతి( Kaun Banega CrorepatI ) ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం 15వ సీజన్‌ ప్రసారమవుతోంది.అయితే తాజా ఎపిసోడ్‌లో అల్లు అర్జున్‌కు సంబంధించిన ప్రశ్న వేశారు.ఈ సందర్భంగా అమితాబ్ మాట్లాడుతూ.

శ్రీవల్లీ పాటలో అల్లు అర్జున్‌ స్టెప్‌ గురించి కామెంట్స్ చేశారు.పుష్ప నిజంగా అద్భుతమైన సినిమా.

అందులో శ్రీవల్లీ పాట ప్రభంజనం సృష్టించింది.చెప్పు వదిలేసినా.

5 Gringos Customer Support And Service Quality (AU) — A Practical Guide
5 Gringos Customer Support And Service Quality (AU) — A Practical Guide

వైరల్‌ కావడం నా జీవితంలో మొదటిసారి చూశాను.ఆ పాట వచ్చాక చాలా మంది అదే స్టెపును వేశారు.

Advertisement

ప్రతి ఒక్కరూ వారి చెప్పులను వదిలేసి మళ్లీ వేసుకునే వారు అని నవ్వుతూ తెలిపారు అమితాబ్ బచ్చన్.ఈ సందర్భంగా అమితాబ్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అల్లు అర్జున్ అభిమానులు ఆ కామెంట్స్ ని తెగ వైరల్ చేస్తున్నారు.

తాజా వార్తలు