కల్కి రిలీజ్ ట్రైలర్ లో ప్రభాస్ కంటే అమితాబ్ హైలెట్.. ఇలా చేయడానికి కారణాలివేనా?

కల్కి సినిమా( Kalki movie ) రిలీజ్ ట్రైలర్ తాజాగా విడుదల కాగా ఈ ట్రైలర్ లో ప్రభాస్ కంటే అమితాబ్ ను హైలెట్ చేయాలని ప్రయత్నించారని కామెంట్లు వినిపిస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ విధంగా చేయడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది.

ప్రభాస్ ( Prabhas )సినిమా కావడంతో తెలుగు రాష్ట్రాల్లో కల్కిపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.హిందీలో సైతం కల్కిపై భారీగానే అంచనాలు ఏర్పడినా ఆ అంచ్నాలను మరింత పెంచాల్సిన అవసరం అయితే ఉంది.

బాలీవుడ్ ప్రేక్షకులకు అమితాబ్, దీపికలను( Amitabh , Deepika ) హైలెట్ చేయడం ద్వారా సినిమాకు కలెక్షన్లు సైతం పెరిగే ఛాన్స్ ఉంటుంది. కల్కి 2898 ఏడీ ఫ్యాన్స్ కు స్పెషల్ మూవీ అవుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదనే సంగతి తెలిసిందే.

కల్కి 2898 ఏడీ బిజినెస్ లెక్కలు విని షాకవ్వడం ఇండస్ట్రీ వర్గాల వంతవుతోంది.కల్కి సినిమా ఫ్యాన్స్ అంచనాలను మించి ఉండబోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Advertisement

కల్కి సినిమా మైథాలజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ( mythological science fiction movie ) కాగా ఈ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న తొలి భారతీయ సినిమా ఇదేనని చెప్పవచ్చు.నాగ్ అశ్విన్ ఈ సినిమా కోసం ఏకంగా ఐదేళ్ల సమయం కేటాయించారు.ఒక సినిమా కోసం ఇంత సమయం కేటాయించే దర్శకులు సైతం చాలా తక్కువమంది ఉంటారని చెప్పవచ్చు.

కల్కి 2898 ఏడీ సినిమా రేంజ్ వేరని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.

నాగ్ అశ్విన్ తన అద్భుతమైన ఆలోచనలతో ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పిస్తున్నారని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.నాగ్ అశ్విన్ ఆలోచనలు భారీ స్థాయిలో ఉండగా ఈ సినిమా ఆ ఆలోచనలకు రూపమని చెప్పవచ్చు.బడ్జెట్ విషయంలో రాజీ పడకపోవడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయని చెప్పవచ్చు.

కల్కి సినిమా విజువల్ వండర్ అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.

వావ్‌ : ఒక్క ఆసనంతో ఇన్ని ఉపయోగాలా?
Advertisement

తాజా వార్తలు