'గులాబో సితాబో' లో అమితాబ్ లుక్స్ చూస్తే ఆశ్చర్యపోకమానరు

నటీనటులు ఎప్పుడు ఎలా మారిపోతారో ఎవ్వరికీ అర్ధం కాదు.వారి వేషధారణ,వస్త్ర ధారణ అన్ని కూడా సినిమా కోసం మార్చేసుకుంటూ ఉంటారు.

వారు చేసే పాత్రలో జీవించడం కోసం ఎంతో కష్టపడుతూ తన టాలెంట్ ను నిరూపించుకుంటారు.అయితే ఈ రోజు మెగాస్టార్ సినిమా నుంచి ఒక పోస్టర్ విడుదల అయ్యింది.

ఆ చిత్రంలో ఎవరో వృద్ధుడు కనిపిస్తుండగా తొలుత ఎవ్వరికి అర్ధం కాలేదు.ఆ తరువాత గాని అభిమానులు పోల్చుకోలేక పోయారు.

ఆయన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అని.ఆయన ప్రస్తుతం దర్శకుడు శూజిత్ సర్కార్ తెరకెక్కిస్తున్న గులాబో సితాబో సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఆ చిత్రంలో అమితాబ్ ఎలా ఉంటుందో ఆ లుక్ చూస్తే తెలుస్తుంది.

Advertisement

ఈ చిత్రంలో అమితాబ్ లఖ్ నవూ కు చెందిన ఒక కపిష్ఠి ఇంటి యజమాని పాత్రలో కనిపించబోతున్నారు.అయితే ఆయన లుక్స్ చూడగానే అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు.

నిజంగా అమితాబ్ యేనా ఆ పోస్టర్ లో ఉంది అన్నంతలా వారు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

ఇందులో ఆయుష్మాన్‌ ఖురానా ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ఈ సినిమా కోసం అమితాబ్‌కు ప్రోస్తెటిక్‌ మేకప్‌ వేసినట్లు తెలుస్తుంది.అయితే ఈ మేకప్‌ వేయించుకోవడానికి తాను చాలా అలసిపోయేవాడినని ఒక సారి మీడియా తో మాట్లాడుతూ అమితాబ్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.అంతేకాకుండా ఈ చిత్రంలో అమితాబ్‌ లుక్‌ ఎలా ఉండబోతోందో ముందుగానే శూజిత్‌ పేపర్‌పై బొమ్మ గీసి బిగ్‌బికి చూపించాకే అమితాబ్ ఈ సినిమా లో నటించడానికి ఒప్పుకున్నారట.

ఫ్యామిలీ డ్రామా కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 2020 ఏప్రిల్‌ 24న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు