అమెరికా ప్రజా ప్రతినిధి ప్రపంచ రికార్డ్ సృష్టించాడు...??

ప్రపంచంలో ఉన్న రాజకీయనాయకుల్లో అత్యంత పొడుగైన వ్యక్తిగా అమెరికా కి చెందినా రాజకీయ నాయకుడు రికార్డ్ క్రియేట్ చేశాడు.

గిన్నిస్ బుక్ వారు సైతం అతడు అత్యంత పొడవైన రాజకీయ నాయకుడిగా గుర్తించారు.

ఆ వివరాలలోకి వెళ్తే.న్యూయార్క్ నగర కౌన్సిల్ సభ్యుడిగా ఉన్న రాబర్ట్‌ కార్నెగీ గతంలో ప్రొఫెషనల్‌ బాస్కెట్‌బాల్‌ క్రీడాకారుడు.

ఆయన ఎత్తు ఏకంగా 6 అడుగుల 10 అంగుళాలు.అతడి పక్కన ఎవరు నిలబడినా సరే తలపైకి ఎత్తి చూడాల్సిందే.

అందుకే గిన్నిస్ బుక్ ప్రతినిధులు సైతం అతడి రికార్డ్ ని నమోదు చేసుకున్నారు.

Advertisement

అయితే ఇలా గుర్తింపు పొందటం చాలా కష్టం, అతడి రికార్డ్ కి తగ్గ ఆధారాలు చూపించాలి.అతడి ఎత్తుని కూడా నేలపై పడుకోబెట్టి కొలిచారు.ఇదే రికార్డ్ గతంలో లండన్‌కు చెందిన లూయిస్‌ గ్లక్‌స్టీన్‌ పేరు మీద ఉండేది.

ఆయన మరణం తరువాత కార్నెగీ ఈ రికార్డ్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

Advertisement