టీనేజర్ల కోసం అమెరికా కొత్త బిల్లు..!!!

అమెరికా వ్యాప్తంగా స్కూల్స్ కి వెళ్ళే టీనేజర్స్ కోసం ప్రభుత్వం కొత్త బిల్లుని ప్రవేశ పెట్టింది.

ఈ బిల్లుతో విద్యార్ధులు , విద్యార్ధుల తల్లి తండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ బిల్లు తమకి మరింత ఆనందం ఇచ్చిందని ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తున్నారు.అంతేకాదు ఈ బిల్లు ద్వారా తాము మరింతగా చదువుల్లో రాణించగలమని అంటున్నారు.

మరి ఇంతగా అందరిని ఆకట్టుకున్న ఈ బిల్లు ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి.?? అసలు ఈ బిల్లు ఏమిటి.?? అనే వివరాలలోకి వెళ్తే.

అమెరికా స్కూల్స్ కి వెళ్ళే టీనేజర్ల కు నిద్ర కోసం మరింత సమయం ఇవ్వాలని భావించింది.అందులో భాగంగా ఈ బిల్లుని చట్టసభలో ప్రవేసపెట్టింది.ఈ బిల్లు ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే టీనేజర్స్ కి సరిపోయేంత నిద్ర ఉంటె చదువుల్లో చక్కగా రాణించగలరని పలువురు శాసన సభ్యులు అభిప్రాయం మేరకు ఈ బిల్లుని ఆమోదించారు.

Advertisement

అయితే ఈ బిల్లుపై కొంతమందిలో వ్యతిరేకత వచ్చినా మెజారిటీ సభ్యులు ఆమోదించడంతో అమలులోకి రానుంది.ఈ బిల్ ప్రకారం కాలిఫోర్నియా స్టేట్ వ్యప్తమా ఉన్న హై స్కూల్స్ ఇకపై ఉదయం 8.30 గంటల తరువాత ప్రారంభం కావాల్సి అవ్వాల్సి ఉంటుంది.ఈ సందర్భంగా కాలిఫోర్నియా సెనేట్ అంథోనీ పోర్టాంటినో మాట్లాడుతూ ఈ బిల్లు పొందటంలో కాలిఫోర్నియా స్టేట్ పీటీఏ, న్యాయవాదులు ముఖ్య పాత్ర పోషించారని తెలిపారు.

జాక్ పాట్ కొట్టిన మేస్త్రి.. నెలకు కోటి చొప్పున 30 ఏళ్ల వరకు..
Advertisement

తాజా వార్తలు