ఊబకాయులు జర జాగ్రత్త అంటున్నారు అమెరికా శాస్త్రవేత్తలు.వారి పరిశోధించిన అంశాలని పరిగణలోకి తీసుకుని ఎన్నో విషయాలని వెల్లడించారు.
ఊబకాయులకి ముఖ్యంగా గుండె, మధుమేహం అధికంగా వచ్చే ప్రమాదం ఉందని తేల్చి చెప్పారు.అంతేకాదు తమ తాజా పరిశోధనలు మరిన్ని కోణాలు వెల్లడించారు.
కండరాలు, ఎముకలకి సంభందించిన వ్యాధులు వస్తాయని తెలిపారు.
ఈ పరిశోధనలో అమెరికా, యూకే, ఆస్ట్రేలియా దేశాలకి చెందిన ఎంతోమంది శాస్త్రవేత్తలు పాల్గోన్నారని తెలిపారు.శరీర ద్రవ్యరాశి సూచికపై చేసిన పరిశోధనలు ఈ వివరాలు వెల్లడైనాయని తెలిపారు.దీర్గ కాలిక వ్యాదులకి ఈ ఊబకాయం అతిపెద్ద మార్గంగా మారుతోందని వెల్లడించారు.
ప్రపంచ వ్యాప్తంగా మధుమేహంతో బాధపడుతున్న వారిలో అత్యధికులు ఉబాకాయులేనని పేర్కొన్నారు.ఉబాకాయాన్ని మరింత లోతుగా అధ్యయనం చేసిన తరువాత నరాల రుగ్మతలకి, కాళ్ళకు పుండ్లు పడటం, కిడ్నీలు పాడవడం వంటి రోగాలు ఈ కారణంగానే వస్తున్నాయని వారి పరిశోధనలు తేలిందని ప్రకటించారు.
ఎప్పటికప్పుడు బీపీ, మధుమేహం పరిశీలించడం ఈ రుగ్మతలని నిరోధించడం అత్యంత ముఖ్యమైన విషయమని అన్నారు.ఈ కోణంలోనే మరింత పరిశోధనలు జరుపుతున్నామని ఆ విషయాలు కూడా త్వరలో విడుదల చేస్తామని తెలిపారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy