టీడీపీతో ఈసీ అధికారులు కుమ్మక్కు అంటూ అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు..!!

వైసీపీ నేత అంబటి రాంబాబు( Ambati Rambabu ) సంచలన వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో టీడీపీతో( TDP ) ఎన్నికల సంఘం అధికారులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు.

మాచర్లలో( Macherla ) నియోజకవర్గం పరిధిలో అనేక పోలింగ్ కేంద్రాల్లో అరాచకాలు జరిగాయి.వైసీపీ సానుభూతిపరులు ఓటు వేయకుండా తెలుగుదేశం నాయకులు అడ్డుకున్నారు.

కొంతమంది దాడులకు పాల్పడి పోలింగ్ స్టేషన్ నుండి వైసీపీ సానుభూతిపరులను బయటకు గెంటేయటం జరిగింది.ఈ క్రమంలో పోలింగ్ సజావుగా జరగాలని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి( Pinnelli Ramakrishna Reddy ) అధికారులను కూడా వేడుకున్నారు.

కానీ ఎక్కడ కూడా అధికారులు చర్యలు తీసుకోలేదు.ఇదిలా ఉంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేశారని వీడియో ఒకటి విడుదల అయింది.

Advertisement

అది లోకేష్.తెలుగుదేశం విభాగానికి సంబంధించిన సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.

ఎన్నికల సంఘం( Election Commission ) దగ్గర ఉండాల్సిన వీడియో.తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేయటం ఏంటి అంటూ అంబటి రాంబాబు నిలదీశారు.అది వాస్తవమైన వీడియో యేనా కాదా ఎలక్షన్ కమిషన్ చెప్పాలని పేర్కొన్నారు.

తెలుగుదేశం విడుదల చేసిన ఈ వీడియో పై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవటం ఏమిటి అని ప్రశ్నించారు.నేరం ఎవరు చేసినా చట్టం శిక్షిస్తుంది.నిజంగా నేరం చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా.

ప్రయత్నాలు జరగటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి.

విజయవాడలో బిజినెస్ అండ్ టూరిజం వీసాపై సదస్సు
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్24, ఆదివారం 2024

ఈ క్రమంలో ఎక్కడైతే గొడవలు జరిగాయో వాటికి సంబంధించిన పూర్తి వీడియోలు ఎలక్షన్ కమిషన్ బయట పెట్టాలి అని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు