జగన్ దీక్షతో ఫలితం ఉంటుందా?

ఎపీకి ప్రత్యేక హోదా సాధించడానికి వై కా పా అధినేత జగన్ చేస్తున్న నిరాహార దీక్ష గురువారం రెండో రోజుకు చేరుకుంది.

ద్వితీయ విఘ్నం కాకుండా సాగినందుకు మంచిదే.

అయితే ఈ దీక్షతో హోదా వస్తుందా? ఇది సామాన్యులకు కలుగుతున్న సందేహం.ఈ సందేహాన్ని క్లియర్ చేసారు పార్టీ సీనియర్ నేత, జగన్ కుడిభుజం వంటి వాడిన అంబటి రాంబాబు.

జగన్ దీక్ష తప్పకుండా ఫలితం ఇస్తుందని నమ్మకంగా చెప్పారు.అధినేత దీక్షకు ఫలితం ఉండదని చెప్పలేరు కదా.ఈ ఫలితం రావడానికి ఆధారం ఏమిటో చెప్పలేదు.వస్తుందనే నమ్మకం మాత్రమే.

జగన్ పోరాటం చేస్తుండగా ముఖ్యమంత్రి చంద్రబాబు హోదా కోసం తాను పోరాటం చేయబోనని చెప్పారు.కేంద్రంతో పోరాడితే ప్రయోజనం కలగదని, నష్టపోతామని అన్నారు.

Advertisement

కేంద్రంతో మంచిగా ఉంటూ, బతిమిలాడి, బుజ్జగించి ప్రత్యేక హోదాతో పాటు ప్యాకేజీ కూడా సంపాదిస్తామన్నారు.ఎన్నాళ్ళు బతిమాలుతారో తెలియదు.

ఒకప్పుడు కేంద్రంలో బాబు చక్రం బాగానే తిరిగింది.కాని ఇప్పుడు ఈయన తిరగాల్సి వస్తున్నది.

తిరిగినా పని కాకపోతే ఏం చేస్తారో మరి.

జనసేన అలా చక్రం తిప్పబోతోందా ? అందుకేనా ఈ హ్యపీ ? 
Advertisement

తాజా వార్తలు