మద్యం అలవాటు పోవాలా.. అయితే కరక్కాయను ఇలా తీసుకోండి!

ఇటీవల రోజుల్లో మందుబాబుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది.వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది మద్యానికి అలవాటు పడుతున్నారు.

బానిస‌లుగా మారుతున్నారు.ఆరోగ్యాన్ని చేతులారా పాడు చేసుకుంటున్నారు.

ఒక్కసారి మద్యానికి అలవాటు పడితే దాన్ని వదిలించుకోవడం చాలా క‌ష్టం.ఎంతో కృషి పట్టుదల ఉండాలి.

ఆరోగ్యమైన జీవన శైలికి అలవాటు పడాలి.ఇకపోతే మద్యం అలవాటును పోగొట్టడానికి కొన్ని ఇంటి చిట్కాలు ఎంతో అద్భుతంగా సహాయపడతాయి.

Advertisement

ముఖ్యంగా కరక్కాయను( Karakkaya ) ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే తాగుడుకు క్ర‌మంగా దూరం అవుతారు.ఆయుర్వేద వైద్యంలో క‌ర‌క్కాయ‌కు ప్ర‌త్యేక స్థానం ఉంది.

క‌ర‌క్కాయ‌లో ఎన్నో పోష‌కాలు మ‌రెన్నో ఔష‌ధ గుణాలు నిండి ఉంటాయి.అందుకే అనేక వ్యాధులు నివార‌ణ‌లో క‌ర‌క్కాయ‌ను ఉప‌యోగిస్తారు.

ప్రతిరోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో పావు టీ స్పూన్ కరక్కాయ పొడిని( Karakkaya powder ) కలిపి తీసుకోవాలి.ఈ విధంగా చేస్తే మద్యంపై విరక్తి కలుగుతుంది.

మద్యం అలవాటు పోతుంది.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

అలాగే క‌ర‌క్కాయ‌తో మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి.అర టీ స్పూన్ క‌ర‌క్కాయ పొడిని వ‌న్ టేబుల్ స్పూన్ స్వ‌చ్ఛ‌మైన తేనెలో( honey ) క‌లిసి తీసుకుంటే క‌డుపు నొప్పి, విరేచ‌నాలు నుంచి ఉప‌శ‌మ‌నం పొందుతారు.వికారం, వాంతులు త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

Advertisement

పైల్స్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న వారికి కూడా క‌ర‌క్కాయ ఉప‌యోగ‌ప‌డుతుంది.అర టీ స్పూన్ కరక్కాయ పొడికి అర టీ స్పూన్ బెల్లం పొడి ( Jaggery powder )కలిపి భోజనానికి ముందు తీసుకోవాలి.

ఇలా నిత్యం చేస్తే పైల్స్ స‌మ‌స్య త‌గ్గుతుంది.

దగ్గుకు క‌ర‌క్కాయ‌ సహజ నివారణగా పని చేస్తుంది.ద‌గ్గుతో ఇబ్బంది ప‌డుతున్న వారు అర టీ స్పూన్ క‌ర‌క్కాయ పొడిలో చిటికెడు మిరియాల పొడి, చిటికెడు న‌ల్ల ఉప్పు మ‌రియు ఒక టీ స్పూన్ తేనె క‌లిసి తీసుకోవాలి.రోజుకు రెండు సార్లు ఈ విధంగా క‌ర‌క్కాయ‌ను తీసుకుంటే మొండి ద‌గ్గు అయినా స‌రే పరార్ అవుతుంది.

క‌ఫం క‌రుగుతుంది.శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు తొల‌గిపోతాయి.

తాజా వార్తలు