వేస‌విలో ఒంటికి చ‌లువ చేసే జొన్న జావ‌.. రోజూ తీసుకుంటే మ‌రిన్ని బెనిఫిట్స్‌!

వేసవికాలం రానే వచ్చింది.ఉదయం 9 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.

నిన్న మొన్నటి వరకు ప్రజలు చ‌లికి వణికిపోయారు.ఇప్పుడు వేసవి వేడికి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

ఇక‌పోతే వేసవి కాలంలో దాదాపు ప్రతి ఒక్కరి శరీర ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయి.అందుకే ఒంట్లో వేడిని తగ్గించుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తుంటారు.

ఒంటికి చలువ చేసే ఆహారాలు డైట్ లో చేర్చుకుంటారు.అయితే అటువంటి ఫుడ్స్ లో జొన్న జావ( Jonna Java ) కూడా ఒక‌టి.

Advertisement

సాధారణంగా చాలా మంది వేస‌విలో ఉద‌యాన్నే రాగి జావను తీసుకుంటూ ఉంటారు.కానీ రాగి జావ మాత్రమే కాదు జొన్న జావ‌కు కూడా బాడీని కూల్‌గా మార్చే సామ‌ర్థ్యం ఉంది.

పైగా జొన్న జావ ఆరోగ్యానికి మ‌రెన్నో ప్ర‌యోజ‌నాల‌ను సైతం చేకూరుస్తుంది.

స‌మ్మ‌ర్ లో రోజు ఉదయాన్నే ఒక గ్లాసు జొన్న జావ తీసుకోవడం వల్ల శరీరంలో అధిక వేడి మొత్తం తొలగిపోతుంది.జొన్న జావ మన బాడీకి చల్లదనాన్ని అందిస్తుంది.వేసవి తాపం నుంచి బయటపడడానికి సహాయపడుతుంది.

అలాగే వేసవికాలంలో ఎంతో మంది డీహైడ్రేషన్ బారిన పడుతుంటారు.ఈ రిస్క్ ను తగ్గించడానికి జొన్న జావ తోడ్పడుతుంది.

ఆక‌లిగా లేదని భోజ‌నం మానేస్తున్నారా.. అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఖాయం..!
'హెలికాప్టర్ ' కోసం ఇంత పంచాయతీ జరుగుతోందా ? 

సమ్మర్ లో నిత్యం జొన్న జావను తీసుకుంటే బాడీలో నీటి నిల్వలు తగ్గకుండా ఉంటాయి.శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది.

Advertisement

వేసవి వేడిని తట్టుకునే సామర్థ్యం లభిస్తుంది.

అలాగే జొన్న జావ‌లో డైటరీ ఫైబర్ పుష్క‌లంగా ఉంటుంది.ఇది ప్రేగు కదలికలను నియంత్రించడంలో, మలబద్ధకాన్ని( Constipation ) నివారించడంలో మరియు ఆరోగ్యకరమైన గట్‌ను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.అలాగే అధిక బ‌రువు ఉన్న వారికి జొన్న జావ సూప‌ర్ ఫుడ్‌గా చెప్పుకోవ‌చ్చు.

రోజూ ఉద‌యం జొన్న జావను తీసుకుంటే అతి ఆక‌లి దూరం అవుతుంది.మెట‌బాలిజం( Metabolism ) రేటు పెరుగుతుంది.

దాంతో శ‌రీరంలో అద‌న‌పు కేల‌రీలు వేగంగా క‌రుగుతాయి.మ‌ధుమేహం( Diabetes ) ఉన్న‌వారు కూడా జొన్న జావ‌ను తీసుకోవ‌చ్చు.

ఈ జావ రక్తంలో చక్కెర స్థాయి పెరుగుదలను నిరోధిస్తుంది.మరియు రోజంతా స్థిరమైన శక్తిని అందిస్తుంది.

జొన్న జావ‌లో ఉండే జింక్, మెగ్నీషియం వంటి పోష‌కాలు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.జొన్న జావ‌లో ఉండే కాల్షియం మరియు ఫాస్పరస్ ఎముక‌ల‌ను బలంగా ఆరోగ్యంగా మారుస్తాయి.

కాబ‌ట్టి ఈ వేస‌విలో జొన్న జావ‌ను త‌ప్ప‌క డైట్ లో చేర్చుకోండి.

తాజా వార్తలు