Healthy Salad : నిత్యం ఈ టేస్టీ సలాడ్ ను తిన్నారంటే వెయిట్ లాస్, షుగర్ కంట్రోల్ తో స‌హా అదిరిపోయే బెనిఫిట్స్ మీసొంతం!

ఇటీవల కాలంలో దాదాపు ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతుంది.

హెల్తీ లైఫ్ స్టైల్( Healthy Life Style ) ను మెయింటైన్ చేసేందుకు వీలైనంతవరకు ప్రయత్నిస్తున్నారు.

ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునేందుకు మక్కువ చూపుతున్నారు.ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఒక టేస్టీ అండ్ హెల్తీ సలాడ్ గురించి చెప్పబోతున్నాము.

చాలా మంది సలాడ్స్ తినేందుకు వెనకడుగు వేస్తుంటారు.కానీ ఇప్పుడు చెప్పబోయే సలాడ్ మాత్రం చాలా రుచికరంగా ఉంటుంది.

స‌లాడ్స్( Salads ) ను ఇష్ట‌ప‌డ‌ని వారు కూడా ఈ స‌లాడ్ ను రుచి చూస్తే రెగ్యుల‌ర్ గా తీసుకుంటారు.పైగా ఈ స‌లార్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

Advertisement

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెల్తీ సలాడ్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు ఉడికించిన కాబూలీ శనగలు వేసుకోవాలి.

అలాగే పావు కప్పు సన్నగా తరిగిన టమాటో ముక్కలు, పావు కప్పు కీర దోసకాయ ముక్కలు, పావు కప్పు ఉల్లిపాయ ముక్కలు, రెండు టేబుల్ స్పూన్లు క్యారెట్ తురుము( Carrot ), రెండు స్పూన్లు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి.చివరిగా వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, రుచికి సరిపడా సాల్ట్, పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి మరియు రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్( Lemon Juice ) వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.తద్వారా చానా(శ‌న‌గ‌లు)( Chickpeas ) సలాడ్ సిద్ధం అవుతుంది.

ఈ సలాడ్ రుచిక‌రంగా ఉండడమే కాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఈ సలాడ్ లో కేలరీలు త‌క్కువ‌గా, ప్రోటీన్ మ‌రియు డైట‌రీ ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటాయి.

అలాగే మాంగనీస్, మెగ్నీషియం, జింక్, ఇనుము, రాగి వంటి ఖనిజాలు, థయామిన్, విటమిన్ బి6, విట‌మిన్ ఎ, విట‌మిన్ సి వంటి విటమిన్లు పుష్క‌లంగా ఉంటాయి.ఈ శ‌న‌గ‌ల స‌లాడ్ కడుపు నిండుగా ఉన్న అనుభూతిని ఇస్తుంది.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

ఆక‌లి కోరికలను అరికట్టడంలో సహాయపడుతుంది. అధిక బ‌రువు స‌మ‌స్య( Overweight ) నుండి బ‌య‌ట‌ప‌డేందుకు తోడ్ప‌డుతుంది.అలాగే ఈ స‌లాడ్ లో ఫైబ‌ర్ మెండుగా ఉంటుంది.

Advertisement

ఇది జీర్ణక్రియ ప‌నితీరును పెంచి.మలబద్ధకం వంటి స‌మ‌స్య‌ల‌ను త‌రిమి కొడుతుంది.

శ‌న‌గ‌ల్లో ఉండే ఫైటోన్యూట్రియెంట్స్ పెద్దప్రేగు క్యాన్సర్ వ‌చ్చే రిస్క్ ను త‌గ్గుస్తుంద‌ని కనుగొనబడింది.అంతేకాదు ఈ చానా స‌లాడ్ అనారోగ్యకరమైన చెడు కొలెస్ట్రాల్ ను సమతుల్యం చేసి గుండె సమస్యలను నివారిస్తుంది.

ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను నియంత్రిస్తుంది.నీర‌సం, అల‌స‌ట వంటివి మీ ద‌రి దాపుల్లోకి రాకుండా సైతం అడ్డుకుంటుంది.

తాజా వార్తలు