మాంసాహారం తినకపోతే అశ్వమేథ యాగం చేసినట్లా.. నిజమేనా?

చాలా మందికి ముక్క లేనిదే ముద్ద దిగదు.కనీసం వారంలో మూడు నాలుగు రోజులైనా మాంసాహారం తింటుంటారు.

మధ్య తరగతి ప్రజలు వారానికి ఒక్కసారి అయినా కచ్చితంగా ఏ చికెనో, మటనో తింటారు.కానీ మాంసాహారాల్లో చాలా రకాలు ఉంటాయి.

అయితే అందులో ఏవి తినాలి, ఏవి తినకూడదు అనే విషయాలను గురించి మన పురాణాలు కొన్ని చెప్తున్నాయి.మనుధర్మ శాస్త్రం ఆధారంగా ఎలాంటి మాంసాహారం తీసుకోవాలని పరిశోధిస్తే.

యజ్ఞం చేసే సమయంలో చేసే జంతుబలి హింస క్రిందకు రాదని, ఆ జంతు బలిలో చంపబడే జంతువులు ఉత్తమ జన్మలు పొందుతాయని, మాంసాహారం తినని వాళ్ళు, అశ్వమేథ యాగఫలాన్ని పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి.మద్యం, సంసార సుఖం, మాంసంను శాస్త్రాల్లో చెప్పినట్లుగానే వాడితే చాలా మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి.

Advertisement

పితృదేవతలకు అర్పించి నదీ, అలాగే దేవతలకు అర్పించినదీ, , కొన్నదీ, ఇతరుల ఇచ్చిన మాంసాన్ని తినటంలో తప్పు లేదని మను ధర్మ శాస్త్రం చెబుతోంది.తిన కూడని మాంసాల్లో ఆవూ, గుఱ్ఱమూ, కుక్కా, నక్కా కోతీ, పిల్లీ, ఏనుగూ, సింహమూ, పెద్ద పులీ, ఎలుకా, చుంచూ, ఊర పందీ ఉన్నాయి.

అలాగే భోజనం అయ్యాక వెంటనే నిద్ర పోరాదు.రాత్రిపూట ఉప్పు వేసుకుని భోజనం చెయ్యరాదు.

భోజనము బాగావేడిగా ఉన్నది తీసుకుంటే శక్తి తగ్గుతుంది.అలాగేబాగా చల్లనిపదార్థములుతీసుకున్న జీర్ణముకావు.

పొరపాటున భోజనములో వెంట్రుకలు ఉంటే వెంటనే ఆ భాగం తొలగించి నీళ్ళు చల్లుకొని ఆ తర్వాత తినాలి.

బట్టల మీద ఎలాంటి మరక పడిన ఈ విధంగా చేస్తే మళ్ళి కొత్త వాటిలాగా మెరుస్తాయి
Advertisement

తాజా వార్తలు