కోకో పౌడ‌ర్‌తో ఇలా చేస్తే..చ‌ర్మం తెల్ల‌గా, కోమ‌లంగా మారుతుంద‌ట‌!

కోకో పౌడ‌ర్‌.కోకో బీన్స్ నుంచి త‌యారు చేస్తార‌న్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే.

ఈ కోకో పౌడ‌ర్‌ కేక్స్ త‌యారీలో, చాక్లెట్స్ త‌యారీ ఎక్కువ‌గా ఉప‌యోగిస్తుంటారు.ప్ర‌త్యేక‌మైన రుచి, వాస‌న క‌లిపి ఉండే కోకో పౌడ‌ర్‌.

వంట‌ల‌కే కాదు చ‌ర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.

ముఖ్యంగా చ‌ర్మాన్ని తెల్ల‌గా, కోమ‌లంగా మార్చ‌డంలో కోకో పౌడ‌ర్ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.మ‌రి ఇంత‌కీ కోకో పౌడ‌ర్‌ను స్కిన్‌కు ఎలా యూజ్ చేయాలి అన్న‌ది ఆప్పుడు తెలుసుకుందాం.

Advertisement
Amazing Beauty Benefits Of Cocoa Powder! Beauty, Benefits Of Cocoa Powder, Cocoa

ముందుగా ఒక బౌల్ తీసుకుని.అందులో ఒక స్పూన్ కోకో పౌడ‌ర్ మ‌రియు ఒక‌టిన్న‌ర స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.ప‌ది నుంచి ఇర‌వై నిమిషాల పాటు డ్రై అవ్వ‌నివ్వాలి.

అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా రెండు రోజుల‌కు ఒక సారి చేస్తే.

ముడ‌త‌లు, మ‌చ్చ‌లు త‌గ్గి చ‌ర్మం మృదువుగా, కోమ‌లంగా మారుతుంది.

Amazing Beauty Benefits Of Cocoa Powder Beauty, Benefits Of Cocoa Powder, Cocoa
ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

అలాగే ఒక బౌల్‌లో ఒక స్పూన్ కోకో పౌడ‌ర్‌, ఒక స్పూన్ తేనె మ‌రియు బాగా పండిన అర‌టి పండును గుజ్జును రెండు స్పూన్లు వేసుకుని క‌లుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ఫేస్‌కు ప‌ట్టించి.పావు గంట పాటు వ‌దిలేయాలి.

Advertisement

ఆ త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా వారంలో మూడు, నాలుగు సార్లు చేస్తే.

చ‌ర్మ ఛాయ పెరుగుతుంది.

ఇక ఒక గిన్నెలో

కోకో పౌడ‌ర్ ఒక స్పూన్‌, అలోవెర జెల్

ఒక స్పూన్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి పూసుకోవాలి.ప‌ది, ఇర‌వై నిమిషాల పాటు డ్రై అవ్వ‌నిచ్చి.

అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా డే బై డే చేస్తే.

చ‌ర్మం ఎల్ల‌ప్పుడూ తాజాగా, కాంతివ‌తంగా ఉంటుంది.

తాజా వార్తలు