శివాజీ ని నా ముందు అనవసరంగా లేపకండి అంటూ అమర్ దీప్ షాకింగ్ కామెంట్స్!

ఈ సీజన్ బిగ్ బాస్ షో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.

మొదటి వారం నుండే ఉల్టా పల్టా ట్విస్టులతో సాగిన ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో, చివరి వారం వరకు అదే రేంజ్ టెంపో ని మైంటైన్ చేస్తూ స్టార్ మా ఛానల్ కి రికార్డు స్థాయి టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చేలా చేసింది.

ఇకపోతే ఈ సీజన్ లో కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చి టైటిల్ ని గెలుచుకొని సంచలనం సృష్టించిన పల్లవి ప్రశాంత్ ( Pallavi Prashanth )గురించి ఎంత మాట్లాడుకున్నా అది తక్కువే అవుతుంది.తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే కాదు, ఏ భాషలో అయినా ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యి కప్పు కొట్టడం అనేది ఎక్కడా జరగలేదు.

మొట్టమొదటిసారి మన తెలుగు బిగ్ బాస్ లోనే జరిగింది.ఇకపోతే ఈ సీజన్ రన్నర్ గా అమర్ దీప్ నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే.

Amardeep Shocking Comments Saying Dont Wake Shivaji In Front Of Me Unnecessaril

ఈ సీజన్ లో ప్రతీ కంటెస్టెంట్ ఎదో ఒక్క చిన్న మాస్క్ వేసుకొని గేమ్ ఆడుతూ వచ్చారు కానీ, అమర్ దీప్ మాత్రం అసలు తన చుట్టూ కెమెరాలు ఉన్నాయి అనే విషయం ని కూడా మర్చిపోయి గేమ్ ఆడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.అలా గేమ్ ఆడడం వల్లే అమర్ దీప్ తప్పులు చాలా తొందరగా తెలిసిపోయి ఎక్కువ వీకెండ్స్ నాగార్జున చేత తిట్టించుకునే పరిస్థితి ఏర్పడింది.ఇంత నెగటివిటీ పెట్టుకొని కూడా టాప్ 2 రేంజ్ కి వచ్చాడు అంటే అమర్ దీప్ కి ఆయన అభిమానులు ఎంత బలంగా నిలబడ్డారో అర్థం చేసుకోవచ్చు.

Advertisement
Amardeep Shocking Comments Saying Don't Wake Shivaji In Front Of Me Unnecessaril

ఓట్లు కూడా చాలా తక్కువ మార్జిన్ తోనే ఓడిపోయాడని నాగార్జున( Nagarjuna ) కూడా చెప్పాడు.ఒక కంటెస్టెంట్ మీద ఇంత నెగటివ్ చేసినా కూడా ఈ రేంజ్ కి రావడం అనేది మామూలు విషయం కాదు.

Amardeep Shocking Comments Saying Dont Wake Shivaji In Front Of Me Unnecessaril

ఇకపోతే అమర్ దీప్( Amar Deep ) బయటకి వచ్చిన తర్వాత ఇచ్చిన బజ్ ఇంటర్వ్యూ లో శివాజీ( Sivaji ) గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు.ఆయన మాట్లాడుతూ నన్ను ఎవరు తక్కువ చేసి మాట్లాడినా నేను తీసుకోలేను.కానీ శివాజీ గారు అంటే నాకు ఎదో తెలియని అభిమానం ఉంది.

చిన్నతనం నుండి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను.పెద్దవాడు అనే గౌరవం వల్లే నేను ఆయన్ని తిరిగి ఏమి అనలేదు అంటూ చెప్పుకొచ్చాడు.

అంతే కాకుండా పల్లవి ప్రశాంత్ ఇంత దూరం రావడానికి శివాజీనే కారణం అని అందరూ అనుకుంటున్నారు, దానికి మీరేం సమాధానం చెప్తారు అని అమర్ దీప్ ని యాంకర్ అడగగా దయచేసి ఈ విషయం లో ఆయన్ని లేపకండి.ఆయన తన ఆట ఆడుకొని బయటకి వెళ్ళాడు, వీడు వీడి ఆట ఆడుకొని కప్ కొట్టాడు.

చిరు, బాలయ్య రిజెక్ట్ చేసిన డైరెక్టర్ కు నాగార్జున ఛాన్స్ ఇస్తారా.. ఏమైందంటే?
పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?

ఈ విషయం లో శివాజీ అన్న పేరు తియ్యొద్దు అంటూ చాలా బలంగా చెప్పుకొచ్చాడు.

Advertisement

తాజా వార్తలు