బిగ్ బాస్ ( Bigg Boss ) కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి బుల్లితెర నటుడు అమర్ దీప్ ( Amar Deep ) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
ఎన్నో సీరియల్స్ లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అమర్ బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారనే విషయం తెలియడంతో బహుశా ఈయనే విజేతగా తిరిగి రావచ్చు అని చాలామంది ఈయనపై అంచనాలు పెట్టుకున్నారు.
అయితే ఈయన హౌస్ లోకి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ ఇచ్చే టాస్కులపై ఏమాత్రం కాన్సన్ట్రేషన్ చేయడం లేదు.దీంతో ఈయనపై క్రమక్రమంగా అంచనాలు తగ్గిపోతూ వచ్చాయి.
అలాగే ఈయన హౌస్ లో పల్లవి ప్రశాంత్ ( Pallavi prashanth ) టార్గెట్ చేయడం ఎవరికి నచ్చలేదు.ఇలా ఈయన వ్యవహారి శైలి కారణంగా చాలా నెగెటివిటీని ఎదుర్కొంటున్నారు.
అమర్ దీప్ ప్రతి విషయంలోనూ గొడవకు దిగడంతో చాలామంది ఈయనపై నెగటివ్ కామెంట్లు చేస్తూ ట్రోల్ చేయడమే కాకుండా తనని వెంటనే బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించేయాలి అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు.ఇలా అమర్ గురించి నెగిటివ్ కామెంట్స్ రావడంతో తన తల్లి సోషల్ మీడియా వేదికగా తన కుమారుడి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ వీడియో షేర్ చేశారు.సోషల్ మీడియాలో తన కొడుకు గురించి చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు.
దయచేసి ఇలాంటి ట్రోల్స్ చేయడం ఆపేయండి.నా కొడుకు మంచివాడు కాదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
నా కొడుకు కూడా చిన్నప్పటినుంచి ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు.
తను ఎంతో మంచివాడు అద్భుతమైన నటుడు అద్భుతమైన డాన్సర్ కూడా.కొందరు తనని టార్గెట్ చేసి తప్పుగా కామెంట్లు చేస్తున్నారని దయచేసి ఎవరూ అలా చేయకండి అంటూ ఈమె తెలిపారు.ఇక పల్లవి ప్రశాంత్ గురించి నా కొడుకు తప్పుగా ప్రవర్తించరు.
నా కొడుకు రైతులకు ఎంతో మంచి ప్రాధాన్యత ఇస్తారు.ఎందుకంటే నేను కూడా ఒక రైతు బిడ్డనే.
రైతే ఎప్పటికీ రాజు అమర్ తండ్రి కూడా ఒక మెకానిక్ మేము కూడా ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్లమేనని ఈమె తన కొడుకు గురించి వస్తున్నటువంటి ట్రోల్స్ పై స్పందిస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy