మరోసారి సుప్రీంకోర్టుకు అమరావతి రైతులు

అమరావతి రైతులు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ఆర్5 జోన్ వ్యవహారంపై అమరావతి రైతులు న్యాయస్థానానికి వెళ్లారు.

ఈ క్రమంలో ఇటీవల ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలని పిటిషన్ దాఖలు చేశారు.

దాంతో పాటు ప్రభుత్వ జీవో రద్దు చేయాలని పిటిషన్ లో కోరారు.అయితే అమరావతి రాజధానిలో ఆర్ 5 జోన్ ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాల కోసం ఆ ప్రాంతాన్నికేటాయించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన రైతులు హైకోర్టుకు వెళ్లగా అక్కడ ఊరట లభించలేదు.

ఈ క్రమంలో అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దా అంటూ కోర్టు ప్రశ్నించింది.తరువాత రైతుల పిటిషన్లను కొట్టివేసింది.అయితే రాజధానిపై సుప్రీం ధర్మాసనం తుది తీర్పుకు లోబడి తన ఆదేశాలు ఉంటాయని హైకోర్టు వెల్లడించింది.

దీంతో ఇవాళ రైతులు సుప్రీంకోర్టుకు వెళ్లారు.

Advertisement
వాడిన కాఫీ పొడిని మ‌ళ్లీ ఇలా కూడా వాడొచ్చు.. తెలుసా?