రెండో లిస్టులో అమరావతే ఫ‌స్టు?

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి కేం్ర‌ద‌సాయం అంతంత మాత్రంగానే అందుతుండ‌టంతో పూర్తి స్ధాయిలో నిధులు పొందేందుకు ఆకర్షణీయమైన నగరాల్లో (స్మార్ట్‌ సిటీ) అమరావతికి చోటు దక్కేలా ముఖ్యమంత్రి చంద్రబాబు తనదైన శైలిలో పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది ఇప్ప‌టికే సీఆర్డీఏ అధికారులు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు దరఖాస్తు చేసినట్టుస‌మాచారం.

పాల‌న అమ‌రావ‌తి నుంచి ప్రారంభించి, కొత్త వాతావ‌ర‌ణాన్ని క‌ల్సించిన త‌దుప‌రి అమ‌రావ‌తికి అన్ని ఆర్హ‌త‌లూ ఉన్నందున స్మార్ట్‌సిటీ గా ్ర‌ప‌క‌టించే ఆస్కారం ఉన్న‌ట్టు అధికారులు చెప్తున్నారు.

ఈ మేర‌కు అర్జీలందించిన‌ నగరాలలో అమరావతి అగ్రభాగాన ఉన్నట్టు సమాచారం.రెండవ విడత స్మార్ట్‌సిటీ నగరాల ఎంపికకు సంబంధించి త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఒక ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించే అవకాశాలున్నాయని, అందులో అమరావతికి చోటు దక్కుతుందన్న ఆశాభావం అధికార వ‌ర్గాల‌లో వినిపిస్తోంది.ఇటీవల సీఎం చంద్రబాబు ఇచ్చిన విందు సమావేశంలో పాల్గొన్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి వెంకయ్య నాయుడు సైతం అమరావతిని ఆకర్షణీయమైన నగరాల్లో చేర్చేవిధంగా కృషి చేస్తాన‌ని హామీ ఇవ్వడంతో ఖ‌చ్చితంగా అమరావతికి స్మార్ట్‌సిటీ హోదా ద‌క్క‌డం ఖాయ‌మ‌ని, దీంతో రూ.1,736 కోట్ల నిధులు వస్తాయని సీఆర్డీఏ అధికారులు అంచనా వేస్తున్నారు.పెద్ద ఎత్తున నిధులు వ‌చ్చే ఆస్కారం ఉన్నందున త్వ‌రిత గ‌తిన అమ‌రావ‌తిని అభివృద్ధి చేసుకునే అవ‌కాశాలు ఉంటాయి.

కాగా ఇప్ప‌టికే ఆం్ర‌ధ్ర‌ప‌దేశ్‌ రాష్ట్రంలో విశాఖ ప‌ట్నం నగరాన్ని కేంద్రం స్మార్ట్‌సిటీగా ప్రకటించ‌గా, ఈ న‌గ‌రాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు అమెరికా ప్రభుత్వం ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు