పెళ్లి తర్వాత హ్యాపీగా లేము... ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన అమర్ తేజు... ఆ వార్తలను నిజం చేస్తారా?

సినిమా ఇండస్ట్రీలో ప్రేమించుకోవడం పెళ్లిళ్లు చేసుకోవడం మనస్పర్ధలు వస్తే విడాకులు తీసుకొని విడిపోవడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది.

ఒకప్పుడు ఈ కల్చర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఉండేది కానీ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు విడాకులు( Divorce ) తీసుకొని విడిపోతున్నారు.

ఇక ఇదే తరహాలోనే బుల్లితెర నటీనటులు కూడా పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకొని విడిపోవడం తిరిగి రెండో పెళ్లిళ్లు చేసుకోవడం అనేది జరుగుతుంది.అయితే తాజాగా మరో క్రేజీ కపుల్స్ సైతం తాము పెళ్లి తర్వాత హ్యాపీగా లేము అంటూ షాకింగ్ న్యూస్ బయట పెట్టారు.

Amar Deep And Tejaswini Shocked By Saying That We Are Not Happy After Marriage D

బుల్లితెర నటీనటులుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అమర్ దీప్ ( Amardeep ) తేజస్విని ( Tejaswini ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వీరిద్దరూ బుల్లితెర సీరియల్స్ ద్వారా మంచి సక్సెస్ అందుకున్నారు అనంతరం ప్రేమలో పడి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.ఇక వీరి వివాహం జరిగి కూడా మూడు సంవత్సరాలు అవుతుంది.

ఇక ఈ జంటను చూస్తే భార్యాభర్తలు అంటే ఇలా ఉండాలి అనే విధంగా వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు.

Amar Deep And Tejaswini Shocked By Saying That We Are Not Happy After Marriage D
Advertisement
Amar Deep And Tejaswini Shocked By Saying That We Are Not Happy After Marriage D

ఇకపోతే తాజాగా వీరిద్దరూ ఓంకార్ ( Omkar ) హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఇస్మార్ట్ జోడి ( Ishmart Jodi ) సీజన్ 3 కార్యక్రమంలో పాల్గొంటున్నారు.తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వీడియో వైరల్ అవుతుంది.ఈ వీడియోలో భాగంగా ఓంకార్ వీరిని ప్రశ్నిస్తూ మీరిద్దరూ మీ వైవాహిక జీవితంలో 100% హ్యాపీగా లేమనిపిస్తే ఒక చైర్ వదిలి కూర్చోండని చెబుతారు.

దీంతో వీరిద్దరూ కూడా ఒక కుర్చీ వదిలేసి కూర్చోవడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అయ్యారు.ఏంటి వీరిద్దరూ హ్యాపీగా లేరా గతంలో వీరు విడాకులు తీసుకొని విడిపోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి కొంపతీసి ఆ వార్తలను నిజం చేస్తారా అంటూ అభిమానులు షాక్ అవుతున్నారు.

మరి నిజంగానే హ్యాపీగా లేరా లేకపోతే షో కోసమే అలా చేశారా అనేది తెలియాల్సి ఉంది.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు