ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్న నటి ఆమని తల్లి.. ఏం జరిగిందంటే..?

తెలుగు, తమిళ సినిమాలలో నటించి నటిగా ఆమని మంచి పేరును సొంతం చేసుకున్నారు.తాజాగా అలీతో సరదాగా షో పాల్గొన్న ఆమని తన అసలు పేరు మంజుల అని జంబలకిడి పంబ మూవీ కోసం ఈవీవీ సత్యనారాయణ తన పేరును మార్చారని ఆమె అన్నారు.

90 కంటే ఎక్కువ సినిమాలలో హీరోయిన్ రోల్స్ లో తాను నటించానని పెద్ద పెద్ద డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించే ఛాన్స్ రావడం తన లక్ అని ఆమని చెప్పుకొచ్చారు.జంబలకిడి పంబ అడిషన్ సమయంలో నాన్న చనిపోయారని ఆ సమయంలో అడిషన్స్ కు వెళ్లి ఎంపిక కావడం కష్టమనిపించిందని ఆమని అన్నారు.

తనకు ఆసక్తి లేదని ఈవీవీ సత్యనారాయణకు చెప్పానని అయితే ఫోటో నచ్చడంతో అడిషన్ చేయాలని కోరగా అమ్మ ఒప్పించి పంపించిందని ఆమని వెల్లడించారు.అమ్మ పిల్లలను దత్తత తీసుకోవడం గురించి ఆమని స్పందిస్తూ అమ్మ ఎవరైనా కష్టాల్లో ఉంటే తట్టుకోలేరని చెప్పుకొచ్చారు.

ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులు లేక బాధ పడుతుండటంతో వాళ్లను దత్తత తీసుకున్నారని ఆమని అన్నారు.

Amani Comments About Mother In Alitho Saradaga Interview Show, Alitho Saradaga,
Advertisement
Amani Comments About Mother In Alitho Saradaga Interview Show, Alitho Saradaga,

వాళ్లు కూడా ప్రేమతో ఉంటారని తాను సినిమాలలో నటిస్తున్న సమయంలో అమ్మ మరో 5 నెలల పాపను కూడా దత్తత తీసుకున్నారని ఆ సమయంలో అందరూ తన కూతురు అని భావించేవాళ్లని ఆమని తెలిపారు.ఆ తర్వాత తాను అమ్మ లేకుండానే షూటింగ్ కు వెళ్లేదాననినని ఆమని పేర్కొన్నారు.

Amani Comments About Mother In Alitho Saradaga Interview Show, Alitho Saradaga,

చిన్నప్పటి నుంచే తనకు సినిమాలంటే పిచ్చి అని హీరోయిన్ అయిన తర్వాత వచ్చిన ప్రతి ఛాన్స్ ను వదులుకునేదానిని కాదని ఆమె అన్నారు.ఒకే సంవత్సరం 11 సినిమాలలో నటించడం సంతోషంగా ఉందని మిష్టర్ పెళ్లాం అనే సినిమాకు తనకు నంది అవార్డ్ కూడా వచ్చిందని ఆమని తెలిపారు.శుభలగ్నం సినిమాలో పాత్ర చేయడానికి మొదట భయపడ్డానని ఆమని ఆన్నారు.

Advertisement

తాజా వార్తలు