కొత్త వీడియో షేర్ చేసిన అల్లు స్నేహ.. తన ఆనందం ఇందులోనే ఉంటుందంటూ..

టాలీవుడ్ స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఈయన ప్రజెంట్ ఐకాన్ స్టార్ గా గ్లోబల్ వైడ్ గా వెలుగొందు తున్నాడు.

అల వైకుంఠపురములో, పుష్ప సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు.ముఖ్యంగా పుష్ప సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు.

ఇక అల్లు అర్జున్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన పర్సనల్ లైఫ్ లో జరిగే విషయాలను సైతం ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటాడు.మరి అల్లు అర్జునే కాదు ఆయన సతీమణి అల్లు స్నేహ కూడా ఎప్పుడు తమ కుటుంబంలో జరిగే వాటిని ఇంకా ఆమె పిల్లల గురించి షేర్ చేస్తూ మెగా ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తూ ఉంటుంది.

ఈ క్రమంలోనే తాజాగా అల్లు స్నేహ కొత్త వీడియోను షేర్ చేసింది.సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్స్ ను కొత్త కొత్త అప్డేట్ లతో అలరిస్తూ ఉంటుంది.

Advertisement

మరి తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.ఈమె తమ ఇంటి గార్డెన్ లో నడుస్తూ వీడియో చేసారు.మన జీవితంలో నిజమైన ఆనందం అంటే చుట్టూ మొక్కలు ఉండడమేనని.

వాటిని ఎంతో ఇష్టంతో జాగ్రత్తగా పెంచుకోవడం, చూసుకోవడం తనకు ఆనందం అని అందుకే నాకు ఎంతో ఇష్టమైన ప్రదేశాల్లో నర్సరీ ఒకటని ఈమె తెలిపారు.ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

ఇదిలా ఉండగా అల్లు అర్జున్ సినిమా విషయానికి వస్తే.ప్రజెంట్ అల్లు అర్జున్ పుష్ప సీక్వెల్ లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప ది రూల్ ను మైత్రి మూవీ మేకర్స్ మరింత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ప్రెజెంట్ శరవేగంగా షూట్ జరుపు కుంటున్న ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ పని చేస్తుండగా.ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Dandruff Homemade Serum : ఈ హోమ్‌ మేడ్ సీర‌మ్ ను వాడితే డాండ్రఫ్ అన్న మాటే అన‌రు!
Advertisement

తాజా వార్తలు