బన్నీ అట్లీ కాంబో మూవీలో అంతమంది హీరోయిన్లా.. వామ్మో ప్లానింగ్ మాత్రం వేరే లెవెల్!

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ త్వరలోనే డైరెక్టర్ అట్లీతో కలిసి సినిమా మొదలు పెట్టబోతున్న విషయం తెలిసిందే.

ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా వచ్చింది.

ప్రస్తుతం సినిమా షూటింగ్ మొదలుపెట్టడమే తరువాయి పని.కాగా ఈ కాంబినేషన్ అనౌన్స్మెంట్ సెన్సేషన్ అయిన విషయం తెలిసిందే.ఇటు అల్లు అర్జున్(Allu arjun), అటు అట్లీ (Atlee)ఇద్దరు కూడా కెరియర్లో మంచి ఫుల్ ఫామ్ లో ఉన్నారు.

ఇలాంటి సమయంలో వీరిద్దరి కాంబోలో ఒక మూవీ పడడంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్ కి చేరాయి.వీరిద్దరి కాంబో మూవీ గురించి చెబుతూ ఒక చిన్న వీడియోని విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఆ చిన్న వీడియోలో చెప్పింది చాలా వుంది.

Advertisement

ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది.సినిమాకు సీజీ పనులు చాలా వున్నాయి.అందుకే వెల్ ప్లాన్డ్ గా ముందుకు వెళ్తున్నారు.

ఇకపోతే ఈ సినిమా కోసం హీరోయిన్ల వేట మొదలైందట.ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు హీరోయిన్ల అవసరం వుందట.

ఎవరి పాత్ర ఎంత మేరకు, ఎవరు మెయిన్ హీరోయిన్, మిగిలిన ఇద్దరికి ఏ మేరకు పాత్రలు వుంటాయి ఇలాంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.అయితే ఇందులోఒక హీరోయిన్ గా జాన్వీ కపూర్ (Janhvi Kapoor)ను తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఆ తరువాత మరో ఇద్దరు హీరోయిన్లు ఎవరైతే బాగుంటుంది అనే కన్నా, ఎవరైతే డేట్ లు అవైలబుల్ గా ఉంటాయి అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

న్యూస్ రౌండప్ టాప్ 20

ఈ భారీ బడ్జెట్ ను వీలయినంత వేగంగా తీయాల్సి ఉందట.ఎందుకంటే సిజి వర్క్(CG work) లు అన్నీ విదేశీ సంస్థల్లో చేయించాల్సి ఉంది.కానీ దానికి చాలా టైమ్ పడుతుందట.

Advertisement

ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మరి మిగతా ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరు అన్నది చూడాలి మరి.ఇకపోతే హీరో అల్లు అర్జున్ విషయానికి వస్తే.ఇటీవల అల్లు అర్జున్ పుష్ప 2 (Allu Arjun Pushpa 2)మూవీతో మరో సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

దేశవ్యాప్తంగా భారీగా పాపులారిటీని సంపాదించుకున్నారు.పాన్ ఇండియా స్టార్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు.

తాజా వార్తలు