జానీ విషయంలో న్యాయం చేసిన అల్లు అర్జున్ మరి కేశవ విషయం లో మాత్రం ఎందుకు చేయలేకపోయాడు...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నప్పటికీ గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న హీరో అల్లు అర్జున్( Allu Arjun ).

ఆయన చేసిన ఆర్య, బన్నీ, పరుగు, రేసుగుర్రం, సరైనోడు లాంటి సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లుగా నిలిచాయి.

వీటితో పాటుగా అలా వైకుంటపురంలో సినిమాతో నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డును సాధించడంతో ఒక్కసారిగా ఆయన తెలుగులో భారీ గుర్తింపునైతే సంపాదించుకున్నాడు.ఇక సుకుమార్( Sukumar ) లో ఆయన చేసిన పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు.

ఇక ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాల మీద ప్రేక్షకుల విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.మరి వాటికి తగ్గట్టుగానే ఇప్పుడు ఆయన చేస్తున్న పుష్ప 2 ( pushpa2 )సినిమకూడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి.

ఇక మొత్తానికైతే ఆయన చేసిన చాలా సినిమాలు తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఇప్పుడు మరొకసారి భారీ పెను సంచలనాన్ని సృష్టించడానికి ఆయన రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ( Choreographer Johnny Master )తన అసిస్టెంట్ ను చాలా సంవత్సరాల నుంచి లైంగికంగా వేధిస్తున్నాడు అంటూ ఆమె పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది.

Advertisement
Allu Arjun Who Did Justice In Johnny's Case And Why He Couldn't Do It In Keshav'

ఇక ఆమె కంప్లైంట్ చేసిన వెంటనే అల్లు అర్జున్ ఆమెకి సపోర్ట్ గా ఉంటూ తమ గీతా ఆర్ట్స్ బ్యానర్లో( Geetha Arts banner ) జరిగే ప్రతి సినిమాకు సంబంధించిన కొరియోగ్రఫీ వ్యవహారాలను ఆమె చూసుకునే విధంగా ఆమెకి ఒక అవకాశం అయితే ఇస్తున్నట్టుగా ప్రకటించాడు.

Allu Arjun Who Did Justice In Johnnys Case And Why He Couldnt Do It In Keshav

నిజానికి దీంతో ఈ రచ్చ అనేది తారా స్థాయిలో ఎలివేట్ అయిందనే చెప్పాలి.నిజానికి అల్లు అర్జున్ ఆమె తరుపున బాసటగా నిలవడం అందరికీ సంతోషాన్ని కలిగించే విషయమే, అయినప్పటికీ జానీ మాస్టర్ విషయంలో మాత్రమే ఇలా ఎందుకు చేశాడు.మిగతా వాళ్ళు ఎన్నోసార్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అంటూ చాలా మంది బయటకు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ ను చెప్పినప్పటికి పట్టించుకోని అల్లు అర్జున్ ఇప్పుడే ఎందుకు ఇలా రెస్పాండ్ అయ్యాడు.

అనే ధోరణి లో కూడా కొన్ని వార్తలు వచ్చాయి.నిజానికి అల్లు అర్జున్ కి జానీ మాస్టర్ కి కొద్ది రోజుల నుంచి పడటం లేదనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

ఇక దానికి కారణం ఏంటి అంటే జానీ మాస్టర్ జనసేన పార్టీలో చేరడమే అని మరి కొంతమంది వాదిస్తున్నారు.ఇక ఈ విషయంతో అల్లు అర్జున్ చేసిన పుష్ప సినిమాలో కేశవ క్యారెక్టర్ ని పోషించిన జగదీష్ అనే నటుడి ప్రస్తావన బయటికి వచ్చింది.

సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే

ఆయన కొద్ది నెలల క్రితం ఒక అమ్మాయిని లైంగికంగా వేధిస్తే ఆమె ఉరివేసుకొని చనిపోయింది.ఇక ఆ కేసులో జైల్లోకి వెళ్లిన జగదీష్ ని సినిమా షూటింగ్ లో భాగంగా పుష్ప సినిమా ప్రొడ్యూసర్స్ బెయిల్ మీద అతన్ని బయటకు తీసుకువచ్చారు.మరి ఆ సందర్భంలో అల్లు అర్జున్ రెస్పాండ్ అయి ఆ చనిపోయిన కుటుంబానికి ఎంతోకొంత నష్టపరిహారాన్ని ఎందుకు చెల్లించలేదు అంటూ సోషల్ మీడియాలో ఈ రెండు విషయాల మీద అల్లు అర్జున్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు