Allu Arjun Sneha Reddy : అత్తారింటికి వెళ్లిన అల్లు అర్జున్.. భారీగా తరలివచ్చిన అభిమానులు!

మామూలుగా స్టార్ సెలబ్రెటీలు పబ్లిక్ ప్లేస్ లోకి వస్తే మాత్రం చాలా రచ్చ రచ్చ ఉంటుంది.

ఎందుకంటే ఎవరైనా హీరో హీరోయిన్ రోడ్లపైకి వచ్చారు అంటే అక్కడున్న ఫ్యాన్స్ తమ అభిమాన నటులను చూడటానికి, వారితో ఫోటోలు దిగటానికి ప్రయత్నిస్తూ మీది మీదికి వస్తుంటారు.

ఇక అటువంటి ఘటననే స్టార్ హీరో అల్లు అర్జున్ కు ఎదురయింది.టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అల్లు అర్జున్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.

హీరోగా తనకంటూ ఒక గుర్తింపుతో పాటు మంచి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.ఇక గత ఏడాది విడుదలైన పుష్ప సినిమాతో మాత్రం పాన్ ఇండియా లెవెల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

ఇక ఈయన సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు.అటువంటిది ఈయన బయట కనిపిస్తే మాత్రం ఊరుకుంటారా.

Advertisement

ఎప్పుడెప్పుడు ఆయనను కలవాలి ఎప్పుడెప్పుడు ఆయనతో ఫోటోలు దిగాలా అని చూస్తుంటారు.ఇక ఈయన ఏదైనా సినీ ఈవెంట్లో పాల్గొన్నప్పుడు ఆ వేదిక మీదికి అడుగుపెడితే చాలు వెంటనే ఫాన్స్ ఆనందంతో అల్లర్లు చేస్తారు.

పుష్ప మూవీ తర్వాత ఈయన ఇతర దేశాలలోకి వెళ్లిన కూడా అక్కడ కూడా ఆయన అభిమానులు తెగ ఎగబడుతూ ఉంటారు.ఎందుకంటే ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ అలా ఉందన్నమాట.

ఇదంతా పక్కన పెడితే తాజాగా అల్లు అర్జున్ తన అత్తగారింటికి వెళ్ళగా అక్కడ కూడా ఆయన అభిమానులు ఎగబడ్డారు.

ఇంతకు ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళాడో తెలుసుకుందాం.అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి జన్మస్థలం నల్గొండ జిల్లా, పెద్దవూర మండలం, చింతపల్లి గ్రామం అయితే అల్లు అర్జున్ మామ అయిన స్నేహ రెడ్డి తండ్రి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి తోటి అల్లుడు నామిరెడ్డి వీరారెడ్డి మూడు రోజుల కిందట అనారోగ్యంతో మృతి చెందాడు.దీంతో తన చిన్న మామయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి అల్లు అర్జున్ తన భార్య పిల్లలతో చింతపల్లి గ్రామానికి చేరుకొని.

Amerio Erfahrungen Und Reputation : Eine Analytische Einordnung
Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...

అక్కడ వీరారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అంతే కాకుండా వారి కుటుంబ సభ్యులను పరామర్శించాడు.ఆ తర్వాత పక్కనే ఉన్నదని అత్తగారింటికి వెళ్లి విశ్రాంతి తీసుకున్నాడు.

Advertisement

దీంతో ఆ గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులకు కూడా అల్లు అర్జున్ వచ్చాడని తెలియడంతో ఆయనను చూడటానికి అభిమానులంతా తరలివచ్చారు.ఆయనతో ఫోటోలు దిగటానికి ప్రయత్నించారు.ఇకఅల్లు అర్జున్ బౌన్సర్లు అభిమానులను అడ్డుకోవడంతో వాళ్లు ఫీలయ్యారు.

అల్లు అర్జున్ బయలుదేరుతుండగా కొందరు ఆ వీడియోను తీయగా ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

గతంలో కూడా అల్లు అర్జున్ తన అత్తారింటికి వచ్చినప్పుడు.ఇలాగే ఆయన అభిమానులు ఆయనను చూడటం కోసం ఎగబడ్డారు.ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బిజీలో ఉంది.