పవన్ వ్యాఖ్యలపై బన్నీ మామ చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ముదురుతున్న వివాదం!

సినీ ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉన్నటువంటి మెగా ఫ్యామిలీ( Mega Family ) అల్లు ఫ్యామిలీ( Allu Family ) మధ్య ఇప్పటికే పెద్ద ఎత్తున వివాదం నెలకొన్న సంగతి మనకు తెలిసినదే.

ఏపీ ఎన్నికల సమయంలో జరిగిన ఈ వివాదం బాగా ముదురుతోంది.

అల్లు అర్జున్( Allu Arjun ) కేవలం పవన్ కళ్యాణ్( Pawan Kalyan )కు సపోర్ట్ చేయలేదన్న కారణంతోనే అల్లు ఫ్యామిలీని మెగా ఫ్యామిలీ దూరం పెట్టారు.అంతేకాకుండా ఇరువురి కుటుంబాల మధ్య మాటల యుద్ధం కూడా నడుస్తుంది.

ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ సినిమాలు చేసే హీరోల గురించి మాట్లాడుతూ ఒకప్పుడు హీరోలు సినిమా చేస్తే అడవులను సంరక్షించే విధంగా ఉండేవి కానీ ఇప్పుడు స్మగ్లింగ్ చేస్తూ సినిమాలు చేస్తున్నారని కామెంట్స్ చేశారు.

ఇక ఈ వ్యాఖ్యలు కచ్చితంగా అల్లు అర్జున్ ని ఉద్దేశించే చేశారని అల్లు అర్జున్ అభిమానులు ఫైర్ అయ్యారు.అయితే తాజాగా అల్లు అర్జున్ పుష్ప సినిమా( Pushpa Movie ) గురించి పవన్ కళ్యాణ్ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలను అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి( Chandra Shekhar Reddy ) తప్పుపట్టారు.ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈయన పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తప్పు అని ఆయన వెనక్కి తీసుకోవాలి అంటూ డిమాండ్ చేశారు.

Advertisement

ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.పవన్ కళ్యాణ్ సినిమాల గురించి మాట్లాడుతూ చెట్లను నరకడం స్మగ్లింగ్ చేస్తున్నారని ఎందుకు మాట్లాడారు.ఆయన మాటలు వెనుక అర్థం ఏంటో పెద్ద మనసుతో బయట పెట్టాలి అల్లు అర్జున్ కేవలం స్మగ్లింగ్ చేసే పాత్రలలో నటించారు కానీ వ్యాపారం చేయడం లేదు కదా అని ప్రశ్నించారు.

ఒకవేళ స్మగ్లింగ్ చేస్తే ఆయనను తప్పుబట్టాలి.ఒకవేళ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ని ఉద్దేశించి ఇలాంటి మాటలు మాట్లాడి ఉంటే కచ్చితంగా ఆ మాటలను పవన్ కళ్యాణ్ వెనక్కి తీసుకోవాలి అంటూ చంద్రశేఖర్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ రెండు కుటుంబాల మధ్య వివాదం మరింత ముదిరిపోతుందని తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు