పుష్ప కోసమే అంటోన్న బన్నీ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల అల వైకుంఠపురములో సినిమాతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయగా పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది.

ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో బన్నీ తన నెక్ట్స్ మూవీని ఇప్పటికి మొదలు పెట్టాడు.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ చాలా రఫ్ లుక్‌లో కనిపిస్తాడట.

దీనికి సంబంధించిన లుక్‌లో బన్నీ కనిపించడంతో ఈ సినిమాలో ఆయన లుక్ ఎలా ఉంటుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.ఇక ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో సాగుతుందని, ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ పాత్రలో కనిపిస్తాడని చిత్ర వర్గాల టాక్.

ఇక ఈ సినిమాకు శేషాచలం అనే ఆసక్తికరమైన టైటిల్‌ను పెట్టినట్లు తెలుస్తోంది.కానీ తాజాగా ఈ సినిమాకు పుష్ప అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

హీరోయిన్ చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుండటంతో ఈ టైటిల్‌ను పెట్టినట్లు తెలుస్తోంది.బన్నీ పుట్టినరోజైన ఏప్రిల్ 8న ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేయనుంది.

ఈ సినిమా టైటల్ విషయంలో మరి ఏది ఫిక్స్ అవుతుందో తెలియాలంటే మాత్రం చిత్ర యూనిట్ అనౌన్స్ చేసేవరకు ఆగాల్సిందే.ఇక ఈ సినిమాలో బన్నీ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు