అల్లు అర్జున్‌ పుష్ప 2 ఎక్స్‌క్లూజిక్‌ అప్డేట్‌.. ఫ్యాన్స్ కి పూనకాలే

అల్లు అర్జున్‌ పాన్‌ ఇండియా మూవీ పుష్ప 2 గురించి ఎలాంటి అప్‌ డేట్ లేకపోవడంతో అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు.

పుష్ప పుణ్యమా అని బాలీవుడ్ తో పాటు అన్ని భాష ల్లో కూడా పుష్ప రాజ్ కి అభిమానులు ఏర్పడ్డారు.

రెండవ పార్ట్‌ లో పుష్ప స్టోరీ ఏం అవుతుంది.అసలు రెండవ పార్ట్‌ ఎప్పుడు వస్తుందా అంటూ పాన్ ఇండియా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇటీవల పుష్ప 2 సినిమా యొక్క షూటింగ్‌ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి అంటూ వార్తలు వస్తున్నాయి.అయితే చిత్ర యూనిట్‌ సభ్యులు మాత్రం అధికారికంగా ఎలాంటి అప్డేట్‌ ఇవ్వడం లేదు.

సంక్రాంతికి సినిమా యొక్క ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ సమాచారం అందుతోంది.సంక్రాంతి కానుకగా సినిమా యొక్క పోస్టర్‌ ను విడుదల చేయబోతున్నారు.

Advertisement

అంతే కాకుండా సినిమా యొక్క విడుదల తేదీ విషయంలో కూడా సుకుమార్‌ అండ్ టీమ్‌ ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.

ఈ సినిమా చిత్రీకరణ ఇదే ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్‌ వరకు పూర్తి అయ్యేలా సుకుమార్‌ ప్లాన్‌ చేశాడట.కనుక డిసెంబర్‌ లో లేదా వచ్చే ఏడాది సంక్రాంతికి అయినా పుష్ప 2 వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా లో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే.

మొదటి పార్ట్‌ లో ఉన్న నటీ నటులతో పాటు బాలీవుడ్ నుండి కొత్తగా యాడ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి.ఇక పుష్ప 1 లో సమంత ఐటం సాంగ్ చేసిన విషయం తెల్సిందే.

ఆమె సెకండ్‌ పార్ట్‌ లో కనిపించదు.ఆమె స్థానం లో బాలీవుడ్‌ హాట్‌ స్టార్‌ బ్యూటీ ఐటం సాంగ్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

విష్ణువు వరాహవతారం ఎత్తడానికి గల కారణం ఇదే..!

మొత్తానికి పుష్ప 2 యొక్క స్థాయి అమాంతం పెరుగుతుంది కనుక విడుదల ఎప్పుడు ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు