అల వైకుంఠపురములో బన్నీ ఎంతపుచ్చుకున్నాడో తెలుసా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో అన్ని పనులు ముగించుకుని సంక్రాంతి బరిలో రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఈ సినిమాతో బన్నీ-త్రివిక్రమ్ కాంబో బాక్సాఫీస్‌ను చెడుగుడు ఆడేందుకు మరోసారి సిద్ధమయ్యారు.

థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ అన్నీ కలిపి మొత్తంగా ఈ చిత్రం ప్రీరిలీజ్ బిజినెస్ రూ.135 కోట్లు జరిగినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి.ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ బన్నీ కెరీర్‌లోనే హయ్యెస్ట్‌గా నిలిచింది.

ఈ సినిమాకు బన్నీ రెమ్యునరేషన్ కూడా భారీగానే పుచ్చుకున్నట్లు తెలుస్తోంది.ఏకంగా రూ.35 కోట్ల భారీ రెమ్యునరేషన్ బన్నీ ఈ సినిమా కోసం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇంతటి భారీమొత్తంలో రెమ్యునరేషన్ తీసుకునే హీరోలు సౌత్ ఇండియాలో చాలా తక్కువ మంది ఉంటారని సినీ విశ్లేషకులు అంటున్నారు.

ఏదేమైనా కళ్లు చెదిరే రెమ్యునరేషన్ తీసుకుని తమ హీరో సత్తా చాటాడని కాలర్ ఎగరేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్.త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే మాత్రం జనవరి 12 వరకు ఆగాల్సిందే.

పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది.ఈ సినిమాకు థమన్ అందించిన సంగీతం ఇప్పటికే రికార్డులు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.

Advertisement