వీడియో వైరల్: పుష్పరాజ్ స్టైల్లో మరోసారి రచ్చ చేసిన డేవిడ్ బాయ్..

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్( David Warner ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ముఖ్యంగా తెలుగు రాష్ట్ర ప్రజలకు అయితే డేవిడ్ వార్నర్ బదులు డేవిడ్ భాయ్ అంటే త్వరగా గుర్తుపడతారు.

అంతలా డేవిడ్ వార్నర్ తెలుగు ప్రజలకు అలవాటైపోయాడు.ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఐపిఎల్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కు( Sun Risers Hyderabad ) బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో అతడు తెలుగు రాష్ట్ర ప్రజలకు మరింత చేరువయ్యారు.

ముఖ్యంగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీని అందించడంతో ఆ క్రేజ్ మరింతగా పెరిగింది.ఆట ఒకవైపు ఉంటే మరోవైపు సోషల్ మీడియాలో డేవిడ్ వార్నర్ తెలుగు పాటలకు సంబంధించిన ఎన్నో వీడియోలు చేసి తెలుగు ప్రజల మనసుకు దగ్గరయ్యారు.

ముఖ్యంగా బాహుబలి సమయం నుండి అల్లు అర్జున్( Allu Arjun ) నటించిన పుష్ప సినిమా( Pushpa ) దాకా అనేక రకాల సినిమాలకు సంబంధించిన పాటలకు రీల్స్ చేస్తూ మామూలు హడావిడి చేయలేదు.ఇకపోతే తాజాగా ప్రముఖ దర్శకుడు రాజమౌళితో పాటు ఒక యాడ్ లో నటించిన సంగతి కూడా తెలిసిందే.

Advertisement
Allu Arjun Reacts On David Warner Pushpa Advertisement Details, Viral Video, Soc

తాజాగా డేవిడ్ మరో యాడ్ లో మరోసారి మెప్పించాడు.ఇందుకు సంబంధించిన వీడియో కోసం సోషల్ మీడియాలో వైరల్ గా మారంది.

మరి యాడ్ గురించి పూర్తి వివరాలు చూస్తే.

Allu Arjun Reacts On David Warner Pushpa Advertisement Details, Viral Video, Soc

ఇక పానిండియా పుష్ప సినిమా ఏకంగా బ్రాండ్ ప్రమోటర్ గా మారిపోయాడు డేవిడ్ వార్నర్. సినిమాలోని పాటలకు, డైలాగ్సులను ఎక్కువగా రీక్రియేట్ చేసిన అతను ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న సంగతి తెలిసిందే.ఇక తాజాగా మరోసారి తెలుగు ఆడియెన్స్ మనసు దోచుకున్నాడు డేవిడ్.

అది కూడా ఎంతలా అంటే టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం డేవిడ్ వార్నర్ కు రిప్లై ఇచ్చేలా.ఇక ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.

టికెట్స్ వివాదం : సీనియర్ ఎన్టీఆర్ సమయంలోను ఇదే గొడవ.. దాసరికి ఏం జరిగిందో తెలుసా ?

ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్( T20 World Cup ) కోసం అమెరికాలో ఉన్న డేవిడ్ కామెరాన్ వార్నర్ తాజాగా ఓ కమర్షియల్ యాడ్ లో నటించాడు.ఇందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేశాడు.

Allu Arjun Reacts On David Warner Pushpa Advertisement Details, Viral Video, Soc
Advertisement

వేక్‌ఫిట్ మ్యాట్రెస్ యాడ్ లో నటించిన డేవిడ్ వార్నర్ పుష్ప లోని పుష్ప రాజ్ రోల్ ను రీక్రియేట్ చేశాడు.అంతేకాక హిందీలో డైలాగ్‌ లు కూడా చెప్పి ప్రేక్షకులను మెప్పించాడు.పుష్ప రాజ్ స్టైల్ లో ఎడమ చేత్తో తగ్గేదేలే.

అంటూ పోజ్ కూడా ఇచ్చాడు.ప్రస్తుతం ఈ యాడ్ నెటింట్ట తెగ వైరల్ అవుతోంది.

ఇక వార్నర్ యాడ్ చూసిన అల్లు అర్జున్ కూడా ఫన్నీ రిప్లై ఇచ్చాడు.అందులో నవ్వుతున్న ఎమోజీలు జత చేస్తూ థమ్సప్‌ సింబల్‌ షేర్ చేయగా.

ప్రస్తుతం వీరిద్దరి సోషల్ మీడియా పోస్టులు వైరల్ గా అయ్యాయి.

తాజా వార్తలు