పుష్పలో బోలెడు.. అయినా అదిరిపోతాయంట!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది.

ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాను చూసేందుకు జనం ఎగబడ్డారు.

ఈ సినిమా నాన్-బాహుబలి రికార్డులను క్రియేట్ చేయడంతో బన్నీ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో బన్నీ తన నెక్ట్స్ మూవీ ‘పుష్ప’ను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.

Smuggling Scenes To Be Highlight In Pushpa, Pushpa, Allu Arjun, Sukumar, Tollywo

ఇప్పటికే ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సుకుమార్ తీర్చిదిద్దుతున్నాడు.

ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా మెజారిటీ శాతం అడవిలోనే సాగుతుందని చిత్ర యూనిట్ పేర్కొంది.ఈ సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్ సన్నివేశాలు చాలా ఉండబోతున్నాయని, అవి సినిమాకే హైలైట్‌గా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

Advertisement

ఈ సీన్స్‌లో బన్నీ యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా కావడం పక్కా అంటోన్నారు చిత్ర యూనిట్.ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది.

కాగా ఈ సినిమాతో మరోసారి బన్నీ-సుకుమార్ కాంబో అదిరిపోయే సక్సె్స్ అందుకోవాలని చూస్తోంది.కాగా ఈ సినిమాతో వారు హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో బన్నీ చాలా రఫ్ లుక్‌లో కనిపిస్తుండగా, ఆయన సరసన కన్నడ కుట్టి రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

మరి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు తిరిగి ప్రారంభిస్తారో చూడాలి.

ఎండల వల్ల మీ ముఖం మెడ నల్లగా మారాయా.. ఈ రెమెడీతో 20 నిమిషాల్లో చర్మాన్ని రిపేర్ చేసేయండి!
Advertisement

తాజా వార్తలు