'పుష్ప ది రూల్' క్రేజీ అప్డేట్.. ప్రజెంట్ షూట్ ఎక్కడ జరుపు కుంటుందంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మూవీ పుష్ప ది రూల్(Pushpa: The Rule).ఈ సినిమా పుష్ప ది రైజ్ ( Pushpa: The Rise ) సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతుంది.

పుష్ప పార్ట్ 1 ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో చెప్పాల్సిన పని లేదు.

అందుకే ఈసారి భారీ ప్లానింగ్స్ తో ఈ సినిమాను సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు.రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ నిర్మాణ విలువలతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

మన పుష్ప రాజ్ రాకకోసం పాన్ ఇండియా వ్యాప్తంగా ఎంతగా ఎదురు చూస్తున్నారు.ఇటీవలే ఎన్నో అంచనాల మధ్య షూట్ స్టార్ట్ చేసుకున్న ఈ సీక్వెల్ అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా గ్లింప్స్, ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసారు.

వీటికి విశేష స్పందన లభించింది.అప్పటి నుండి ఈ సినిమా కోసం మరింత ఎదురు చూస్తున్నారు.సౌత్ కంటే కూడా నార్త్ ప్రేక్షకులు మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో సుకుమార్ కూడా ఎక్కడ అంచనాలు తగ్గకుండా తెరకెక్కిస్తున్నాడు.

Advertisement

ఇక ప్రజెంట్ ఈ సినిమా షూట్ గురించి క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఒడిశా, మారేడుమిల్లి తదితర ప్రాంతాల్లో పలు కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట.ఈ షెడ్యూల్ పూర్తి అయ్యాక మేకర్స్ నెక్స్ట్ షెడ్యూల్ ను ఓవర్సీస్ లో ప్లాన్ చేశారట.మరి ఇండియాలో షూట్ కంప్లీట్ చేయగానే యూరప్, బ్యాంకాక్ తదితర దేశాల్లో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

చూడాలి మరి పుష్ప ది రూల్ తో ఇంకెన్ని సంచలనాలకు తేరా తీసిందో.

హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!
Advertisement

తాజా వార్తలు