పుష్ప మేకర్స్ పై ఫైర్ అవుతున్న బన్నీ ఫ్యాన్స్... ధర్నా చేసే దిశగా అడుగులు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప (Pushpa) సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.

ఇలా నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి ఈయన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఈ సినిమా కోసం పాన్ ఇండియా స్థాయిలో అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ విడుదల చేస్తారా అని ఇన్ని రోజులు అభిమానులు ఎదురు చూశారు.

ఇప్పటివరకు ఇతర స్టార్ హీరోల సినిమాల నుంచి వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ ఉన్నప్పటికీ పుష్ప 2(Pushpa 2) నుంచి మేకర్స్ ఏ విధమైనటువంటి అప్డేట్స్ విడుదల చేయకపోవడంతో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు వేర్ ఈజ్ పుష్ప అనే ఒక చిన్న గ్లింప్ విడుదల చేశారు.అయితే ఈ వీడియో వచ్చి కూడా దాదాపు మూడు నెలలకు పైగా అవుతుంది ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో నిరుత్సాహంలో ఉన్నటువంటి ఫాన్స్ మైత్రి మూవీ మేకర్స్( Mytri Movie Makers ) సోషల్ మీడియాలో భారీగా ట్రోల్ చేస్తున్నారు.

Advertisement

ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ విడుదల చేయకపోవడంతో #Wake Up Team Pushpa హాష్ ట్యాగ్ సోషల్ మీడియా ట్రెండింగ్ లోకి వచ్చింది.ఇప్పటికైనా మైత్రి మూవీ మేకర్స్ వారు మేలుకోకపోతే బన్నీ అభిమానులు మైత్రి ఆఫీస్ గీతా ఆర్ట్స్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేయాలని సోషల్ మీడియాలో పిలుపునిస్తున్నారు.మరి వెంటనే మైత్రి మూవీ మేకర్స్ మేలుకొని పుష్ప2 సినిమా నుంచి అప్డేట్స్ ఇస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

ఇప్పటివరకు ఈ సినిమా దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు