Allu Arjun : ఆంధ్రాలో మల్టీప్లెక్స్ నిర్మించబోతున్న అల్లు అర్జున్.. ఎక్కడంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ట్ హీరోలుగా కొనసాగుతున్న వారందరూ కేవలం సినిమాలలో నటించడమే కాకుండా ఇతర వ్యాపార రంగాలలో కూడా దూసుకుపోతున్న సంగతి మనకు తెలిసిందే.

ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ బారి స్థాయిలో డబ్బు సంపాదిస్తున్నారు.

అదేవిధంగా మరికొందరు నిర్మాణ రంగంలో దూసుకుపోతూ ఉండగా మరికొందరు స్టూడియో థియేటర్ బిజినెస్ లలో కూడా సక్సెస్ సాధించారు.

Allu Arjun Plans New Multiplex In Vizag

ఇప్పటికే ఏషియన్ వారితో కలిసి హైదరాబాద్ బెంగళూరు వంటి ప్రాంతాలలో మహేష్ బాబు( Mahesh Babu ) అల్లు అర్జున్( Allu Arjun ) విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలు అందరూ కూడా మల్టీప్లెక్స్( Multiplex ) థియేటర్లను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.అయితే త్వరలోనే నటుడు రవితేజ కూడా హైదరాబాదులో ఓ మల్టీప్లెక్స్ ప్రారంభించబోతున్నారు.ఇకపోతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పటికే హైదరాబాదులో ఏషియన్ అల్లు అర్జున్ పేరిట మల్టీప్లెక్స్ రన్ చేస్తున్నారు.

త్వరలోనే మరో మల్టీప్లెక్స్ ఆంధ్రాలో కూడా ప్రారంభించబోతున్నారని సమాచారం.

Allu Arjun Plans New Multiplex In Vizag
Advertisement
Allu Arjun Plans New Multiplex In Vizag-Allu Arjun : ఆంధ్రాలో �

అల్లు అర్జున్ ఏషియన్ వారితో కలిసి వైజాగ్( Vizag ) లో ఈ మల్టీప్లెక్స్ నిర్మించాలనే ఆలోచనలో ఉన్నారట.ప్రస్తుతం వైజాగ్ లో నిర్మితమవుతున్నటువంటి న్యూ ఆర్బిట్ మాల్ లో ఏషియన్ వారితో కలిసి అచ్చం హైదరాబాదులో ఉన్న విధంగానే ఇక్కడ కూడా మల్టీప్లెక్స్ నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.మరి అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ థియేటర్ నిర్మాణం గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ గా మారింది.

ఇక అల్లు అర్జున్ అల్లు స్టూడియోస్ కూడా నిర్మించిన సంగతి మనకు తెలిసిందే.ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన పుష్ప 2 ( Pushpa 2 ) సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు