మరీ అంత బిజీగా ఉన్నావ బన్నీ.. నాటు నాటుపై స్పందన ఏది?

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి(Rajamouli) రూపొందించిన ఆర్ ఆర్‌ ఆర్‌ (RRR)సినిమా లోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు లభించింది.

అద్భుతమైన నాటు నాటు పాటకు తప్ప మరే పాటకు ఆస్కార్ అవార్డును దక్కించుకునే అర్హత లేదని అకాడమీ అవార్డు దక్కింది.

పలువురు సినీ ప్రముఖులు నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్‌ రావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.కీరవాణి (Keeravani)మరియు చంద్రబోస్(Chandra Bose) లకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ అభిమానులు ప్రశంసించారు.

కానీ కొందరు మాత్రం అది కూడా స్టార్స్ అంటూ చెప్పుకునే వారు మాత్రం ఇప్పటి వరకు స్పందించక పోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.సోషల్‌ మీడియాలో అయినా స్పందించి తమ ఆనందం వ్యక్తం చేస్తే వారికి సినిమా పరిశ్రమపై ప్రేమ ఉన్నట్లు అనిపించేది.

కానీ ఇప్పటి వరకు కొందరు నాటు నాటుకు ఆస్కార్ పై స్పందించలేదు.అందులో స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ ఒకరు.

Advertisement

ఇప్పటి వరకు అల్లు అర్జున్‌(Allu Arjun) నుండి ట్వీట్‌ కానీ.ఇన్‌ స్టా గ్రామ్‌ లో పోస్ట్‌ గా ఆస్కార్ గురించి రాలేదు.

ఎంత బిజీగా అల్లు అర్జున్‌ ఉన్నాడు అంటూ కొందరు విమర్శిస్తున్నారు.మన తెలుగు సినిమాకు ఆస్కార్ రావడం వల్లే బన్నీ స్పందించలేదేమో.హిందీ సినిమాకు లేదా ఇతర సినిమాలకు ఆస్కార్ అవార్డు వచ్చి ఉంటే తప్పకుండా స్పందించేవాడేమో కదా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

తెలుగు హీరోల మధ్య కోల్డ్‌ వార్ ఉంటుందనే విషయం వాస్తవం.అయితే అల్లు అర్జున్‌ ఇలా వ్యవహరిస్తాడని మాత్రం మేము అనుకోలేదు అంటూ చాలా మంది విమర్శలు చేస్తున్నారు.

అల్లు అర్జున్‌ ఇప్పటికైనా నాటు నాటుకు ఆస్కార్ పై స్పందిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.ప్రస్తుతం బన్నీ పుష్ప 2 చిత్రీకరణలో పాల్గొంటున్నాడు.రెండు నిమిషాల సమయం కేటాయించి అయినా ట్వీట్‌ చేయవచ్చు కదా అంటూ ఫ్యాన్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.

రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు : రాష్ట్ర మంత్రులు
Advertisement

తాజా వార్తలు