Allu Arjun Trivikram Srinivas : త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా.. మరీ ఆ డైరెక్టర్ల పరిస్థితి ఏంటో?

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ఇటీవల విడుదల అయిన పుష్ప సినిమాతో పాన్ ఇండియాస్టార్ గా మారిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం పుష్ప 2 లో నటిస్తున్న ఇస్తూ బిజీ బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్.

ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.కాగా పుష్ప 2 సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.

పుష్ప 2 సినిమా తర్వాత అల్లు అర్జున్ ఏ దర్శకుడి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు అన్నది ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.ఈ నేపథ్యంలోనే దర్శకుల లిస్టులో చాలామంది దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి.

టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు పలువురు దర్శకుల పేర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో వినిపించిన సంగతి మనందరికీ తెలిసిందే.బాలీవుడ్ నుంచి సంజయ్‌ లీలా భన్సాలీ, కోలీవుడ్‌ నుంచి అట్లీ, ఏఆర్‌ మురుగదాస్‌, తెలుగులో, బోయపాటి శ్రీను వంటి పేర్లు వినిపించినప్పటికీ అవేవీ ఇంతవరకు ఫైనల్ కాలేదు.

Advertisement
Allu Arjun Next Movie Confirm With That Star Director Once Again , Allu Arjun, T

ఇటీవలే కొరటాల దర్శకత్వలో కూడా సినిమా రాబోతోంది అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా అల్లు అర్జున్ కి సంబంధించిన మరొక వార్త సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది.

అల్లు అర్జున్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోతున్నాడు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

Allu Arjun Next Movie Confirm With That Star Director Once Again , Allu Arjun, T

అంతేకాకుండా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాను చేయాలి అనుకుంటున్నారట అల్లు అర్జున్.త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో ఇప్పటికే అలా వైకుంఠపురం లో సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.కాగా ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ కూడా పూర్తి అయ్యింది.నెక్స్ట్ షెడ్యూల్ ఈ నెలలోనే ప్రారంభించాలి అని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే

కానీ మహేష్ బాబు ఫ్యామిలీలో ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో ఆ బాధ నుంచి తేరుకోలేకపోతున్నారు.అయితే మహేష్ బాబు సినిమా పూర్తయిన తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ ఏ హీరోతో సినిమా చేస్తాడు అన్నది క్లారిటీ రాలేదు.

Advertisement

కానీ మరోవైపు మాత్రం అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ తో అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

తాజా వార్తలు