ఫ్లిప్ కార్ట్ కొత్త యాడ్ కోసం బన్నీ పారితోషికం ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

టాలీవుడ్ హీరో, పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) గురించి మనందరికీ తెలిసిందే.

అల్లు అర్జున్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.

ఇకపోతే అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2( Pushpa 2 ) సినిమాలో నటిస్తూ బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.కాగా పుష్ప 1 కి ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఇకపోతే అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమా విషయానికి వస్తే.

Allu Arjun New Flipkart Advertisement And Remuneration, Allu Arjun, Add Shoot, T
Advertisement
Allu Arjun New Flipkart Advertisement And Remuneration, Allu Arjun, Add Shoot, T

ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్( Fahad Fazil ) విలన్ గా నటిస్తుండగా ఇతర పాత్రల్లో సునీల్, రావు రమేష్, ధనుంజయ, యాంకర్ అనసూయ నటిస్తున్నారు.ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.అల్లు అర్జున్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ తాజాగా ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ ఫారమ్ ఫ్లిప్‌ కార్ట్‌కు బ్రాండ్( Flipkart ) అంబాసిడర్‌గా మారినట్లు తెలుస్తోంది.అంతేకాకుండా ఆ యాడ్ కి సంబంధించిన షూట్ కూడా ఇటీవలే ముగిసిందని తెలుస్తోంది.

Allu Arjun New Flipkart Advertisement And Remuneration, Allu Arjun, Add Shoot, T

అయితే ఒక్కో యాడ్‌కు అల్లు అర్జున్ 8 నుంచి 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని తెలుస్తోంది.ఇక అల్లు అర్జున్ గతంలో రెడ్‌బస్, కోకా-కోలా, ఆస్ట్రల్, కెఎఫ్‌సి, జొమాటో వంటి పెద్ద పెద్ద బ్రాండ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సంగతి తెలిసిందే.ఇప్పుడు అల్లు అర్జున్ కథలో మరొక బ్రాండ్ కూడా చేరింది.

మొత్తానికి అల్లు అర్జున్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు.ఈ వార్త సోషల్ మీడియాలో వరలవ్వడంతో అమ్మ బాబోయ్ ఒక్క యాడ్ ఏకంగా అన్ని కోట్ల అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!
Advertisement

తాజా వార్తలు