ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప సినిమా (Pushpa Movie) తో పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ప్రస్తుతం ఈయన పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
ఇకపోతే తాజాగా అల్లు అర్జున్ 30 సంవత్సరాల తర్వాత ఓ గొప్ప వ్యక్తిని కలిసాను అంటూ తను కలిసిన వ్యక్తి గురించి చెబుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ప్రముఖ ఎంటర్టైన్మెంట్ వెబ్ సైట్ బిహైండ్ వుడ్స్ ఇటీవల అవార్డ్స్ జరిగిన సంగతి తెలిసిందే.
ఈ కార్యక్రమంలో పలువురు సినీ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు.ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ కూడా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అర్జున్ గోల్డెన్ ఐకాన్ ఆఫ్ ఇండియన్ సినిమాగా అవార్డ్ ను ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా అందుకున్నారు.అల్లు అర్జున్ వేదికపై మాట్లాడుతూ ఉండగా అక్కడికి తన స్కూల్ టీచర్ (School Teacher) రావడంతో ఒక్కసారిగా అల్లు అర్జున్ ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాకుండా తన టీచర్ కి పాదాభివందనాలు చేశారు.ఆమె పేరు అంబికా కృష్ణన్ అని.మూడో తరగతిలో తన క్లాస్ టీచర్ అని తన టీచర్ తనకు ఎన్నో విషయాలను నేర్పించారని అల్లు అర్జున్ తెలియజేశారు.
నేను మా క్లాసులో లాస్ట్ ర్యాంకర్ అయినా తన టీచర్ తనని ఏమి అనేవారు కాదని, జీవితం అంటే కేవలం మార్కులు మాత్రమే కాదు. ప్రతి ఒక్కరికీ జీవితం వరం.దాన్ని అర్థం చేసుకున్నప్పుడు తప్పకుండా నువ్వు కూడా ఉన్నత శిఖరాలకు వెళ్తావు అని ఆమెచెబుతూ ఉండేవారని అల్లు అర్జున్ తెలిపారు.ఇలా ఇప్పుడు తన టీచర్ ను ఇక్కడ చూడటం తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
ఇక తనకు స్ఫూర్తిని చిన్న చిన్న కొటేషన్స్ రాయడం అలవాటు అందులో భాగంగానే తాను రాసిన only kindness is remembered forever కోట్ కు నా టీచరే స్ఫూర్తి అంటూ ఈ సందర్భంగా తన టీచర్ గురించి అల్లు అర్జున్ చెబుతూ చేసినటువంటి ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy