20 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆర్య.. ఈ హిట్ చిత్రాన్ని వదులుకున్న హీరోలు ఎవరో తెలుసా?

సుకుమార్ ( Sukumar ) అల్లు అర్జున్( Allu Arjun ) కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి సూపర్ హిట్ చిత్రాలలో ఆర్య సినిమా(Arya Movie) ఒకటి.

దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కినటువంటి ఈ సినిమా నేటికీ సరిగ్గా విడుదలై 20 సంవత్సరాలు పూర్తి అయ్యింది.

ఈ క్రమంలోనే ఆర్య సినిమాకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈ సినిమా నేటికి 20 సంవత్సరాలు కావడంతో ఆర్య.

మూవీ యూనిట్ రీ యూనియన్ కూడా జరగనుంది.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది.దిల్ రాజు నిర్మాణంలో నితిన్ హీరోగా నటించిన దిల్ సినిమాకు సుకుమార్ గారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారట.

ఈ సినిమా హిట్ అయితే నీకు డైరెక్టర్గా ఛాన్స్ ఇస్తాను కథ సిద్ధం చేసుకోమని దిల్ రాజు ( Dil raj u) చెప్పడంతో అల్లరి నరేష్ ను( Allari Naresh ) దృష్టిలో పెట్టుకొని ఆర్య సినిమా కథ రాశారట.అయితే ఈ సినిమా అల్లరి నరేష్ వరకు వెళ్లలేదు కానీ రవితేజ, ప్రభాస్, నితిన్ వంటి హీరోలతో ఈ సినిమా చేయాలని భావించారట.

Advertisement

ఈ క్రమంలోనే సుకుమార్ ఈ సినిమా కథతో ఈ హీరోల అందరిని సంప్రదించగా ఈ కథకు తాము సూట్ అవ్వమని చెప్పి ఈ హీరోలందరూ కూడా ఈ సినిమా కథను రిజెక్ట్ చేశారట రిజెక్ట్ చేయడంతో ఫైనల్ గా సుకుమార్ గారు అల్లు అర్జున్ వద్దకు ఈ సినిమా కథ తీసుకువెళ్లగా ఈ సినిమా కథ నచ్చి వెంటనే బన్నీ ఒకే చెప్పారు అలా ఇంతమంది హీరోలు ఈ హిట్ సినిమాని రిజెక్ట్ చేశారని తెలుస్తోంది.అయితే ఈ సినిమాతో అల్లు అర్జున్ నటించిన రెండో సినిమాతోనే బ్లాక్ బాస్టర్ హిట్ అందుకొని స్టార్ హీరోగా మారిపోయారు.అప్పుడు మొదలైనటువంటి సుకుమార్ బన్నీల బంధం పుష్ప సినిమా వరకు కొనసాగుతూ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ హీరోగా మార్చేసారని చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు