బన్నీకి కేరళలో దక్కిన గౌరవం అద్బుతం..

మెగా స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయిలో అభిమానులు ఉంటారో కేరళలో కూడా అదే స్థాయిలో అభిమానులు ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

కేరళ రాష్ట్రంలో అల్లు అర్జున్‌కు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏంటో గత చిత్రాల కలెక్షన్స్‌ను చూస్తే అర్థం అవుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో యావరేజ్‌ టాక్‌ను దక్కించుకున్న సినిమాలు కూడా కేరళలో అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్‌ కారణంగా భారీ వసూళ్లను నమోదు చేసిన దాఖలాలు ఉన్నాయి.అందుకే కేరళ అల్లు అర్జున్‌కు చాలా ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు.

కేరళ అభిమానులు మాత్రమే కాకుండా కేరళ ప్రభుత్వం కూడా అల్లు అర్జున్‌కు సముచిత స్థానం కల్పించింది.తాజాగా ఒక అధికారిక కార్యక్రమానికి అల్లు అర్జున్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి అందరిని సర్‌ప్రైజ్‌ చేసింది.మలయాళంలో ఎంతో మంది స్టార్‌ హీరోలు, సూపర్‌ స్టార్స్‌ ఉన్నా కూడా అల్లు అర్జున్‌ను పిలవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అక్కడకు వెళ్లిన తర్వాత కేరళ ప్రభుత్వం బన్నీని ఎలా రిసీవ్‌ చేసుకుంటుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.

Advertisement

తాజాగా కేరళలో అల్లు అర్జున్‌ అడుగు పెట్టాడు.కేరళలోకి అల్లు అర్జున్‌ ఎంటర్‌ అయినప్పటి నుండి ఆయనకు ప్రభుత్వ లాంచనాలతో, అధికారిక వర్గం మంచి ఏర్పాట్లు చేసింది.ఎక్కడికక్కడ భారీగా అభిమానులు అల్లు అర్జున్‌ను అభిమానంలో ముంచెత్తారు.

కేరళలో అద్బుతమైన స్పందన దక్కడంతో అల్లు అర్జున్‌ చాలా హ్యాపీ ఫీల్‌ అయ్యాడు.మెగా హీరోకు దక్కిన గౌరవంతో మెగా ఫ్యాన్స్‌ కూడా ఖుషీ అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు