ఆ యూట్యూబ్ ఛానల్ ఆఫీస్ పై దాడి చేసిన బన్నీ ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న హీరోలలో అల్లు అర్జున్ (Allu Arjun)ఒకరు.

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో బన్నీ కి క్రేజ్ పెరిగింది.

పారితోషికం పరంగా కూడా బన్నీ టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే.మరోవైపు బన్నీ నటించిన పుష్ప ది రూల్ (Pushpa The Rule)మూవీ రిలీజ్ కు కేవలం మూడు వారాల సమయం మాత్రమే ఉంది.

ఈ సినిమా స్పెషల్ సాంగ్ లో శ్రీలీల(Srilila) నటిస్తున్నట్టు తాజాగా ఒక వార్త వైరల్ కాగా ఆ వార్త నిజమేనని ప్రూవ్ అయింది.పుష్ప ది రూల్ హిట్ గా నిలిస్తే పాన్ ఇండియా స్థాయిలో శ్రీలీల (Srilila)పేరు మారుమ్రోగడం పక్కా అని చెప్పవచ్చు.

అయితే కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు బన్నీ టార్గెట్ గా ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఆఫీస్ పై బన్నీ అభిమానులు దాడి చేశారు.బన్నీ గురించి తప్పుగా వార్తలు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో బన్నీ ఫ్యాన్స్ ఈ పని చేశారని తెలుస్తోంది.

Allu Arjun Fans Attack On Youtube Channel Details Inside Goes Viral In Social Me
Advertisement
Allu Arjun Fans Attack On Youtube Channel Details Inside Goes Viral In Social Me

ఫర్నీచర్, కంప్యూటర్లతో (furniture, computers)పాటు ఇతర సామాగ్రిని అభిమానులు ధ్వంసం చేశారని సమాచారం అందుతోంది.బన్నీ గురించి మరీ దిగజారి కథనాలను ప్రసారం చేసిన నేపథ్యంలో ఫ్యాన్స్ ఈ విధంగా చేశారని తెలుస్తోంది.బన్నీ చావు బ్రతుకుల మధ్య ఉన్నాడంటూ థంబ్ నెయిల్స్ పెట్టడంతో బన్నీ ఫ్యాన్స్ ఈ విధంగా వ్యవహరించాల్సి వచ్చిందని భోగట్టా.

Allu Arjun Fans Attack On Youtube Channel Details Inside Goes Viral In Social Me

ఫ్యాన్స్ ఎలాంటి భౌతిక దాడులకు పాల్పడలేదని తెలుస్తోంది.అల్లు అర్జున్ ఫ్యాన్స్ (allu arjun fans )రచ్చ నేపథ్యంలో వీడియోలను డిలీట్ చేశారని సమాచారం అందుతోంది.ఫ్యాన్స్ దాడి చేయడం గురించి బన్నీ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

బన్నీ ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?
Advertisement

తాజా వార్తలు