బన్నీ, త్రివిక్రమ్‌ మూవీ.. మధ్యలో బోయపాటి!

అల్లు అర్జున్‌ హీరోగా ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వం లో పుష్ప 2( Pushpa 2 ) సినిమా రూపొందుతోంది.

జాతీయ అవార్డు ను సొంతం చేసుకున్న అల్లు అర్జున్‌ పుష్ప 2 కి మరింత ఎక్కువ కష్టపడుతున్నాడు.

జాతీయ అవార్డు తీసుకు వచ్చిన బాధ్యత తో అల్లు అర్జున్ సినిమా లు చేస్తున్నాడు అంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు.కేవలం పుష్ప 2 సినిమా కు మాత్రమే కాకుండా ప్రతి సినిమా కు కూడా ఆయన అదే విధంగా కష్టపడుతూ ఉంటాడు, ఉండాలి అని భావిస్తున్నాడట.

అందుకే సినిమా ల ఎంపిక విషయం లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు అంటూ సమాచారం అందుతోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే త్రివిక్రమ్‌ మూవీ కన్ఫర్మ్‌ అయింది.మరో వైపు బోయపాటి మరియు సందీప్ వంగ సినిమా లు కూడా లైన్ లో ఉన్నాయి.

పుష్ప 2 సినిమా విడుదల అయిన వెంటనే బోయపాటి శ్రీను( Boyapati Srinu ) దర్శకత్వం లో సినిమా ను చేసేందుకు అల్లు అర్జున్‌ ప్లాన్‌ చేసుకున్నాడట.

Advertisement

అంతే కాకుండా అదే సమయంలో త్రివిక్రమ్‌ మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ కూడా జరుగబోతుందట.అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్‌ కాంబోలో రూపొందబోతున్న సినిమా ఒక సోషియో ఫాంటసీ కథ.కనుక ఏడాదిన్నర పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను నిర్వహించాలని భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.మొత్తానికి అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్‌ కాంబో మూవీ( Trivikram ) ని 2025 లో ప్రారంభిస్తారు.2024 లో బోయపాటి సినిమా ను లాంగిచేస్తారు.ఇక సందీప్ వంగ సినిమా ఎప్పుడు ఉంటుంది అనేది ప్రభాస్ స్పిరిట్ పూర్తి అయిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మొత్తానికి బన్నీ ముందు చాలా పెద్ద క్యూ ఉంది.అందులో ఏ సినిమాలు జనాలను ఆకట్టుకుంటాయో చూడాలి.అల్లు అర్జున్ నుంచి రాబోతున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమా లు అనే విషయం తెల్సిందే.

Advertisement

తాజా వార్తలు