బన్నీ సినిమాకు బడ్జెట్ సమస్యలు.. ఆ రేంజ్ లో ఇన్వెస్ట్ చేయడం వాళ్లకు సాధ్యమేనా?

అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా నటించిన పుష్ప సినిమా( Pushpa ) ఇటీవల విడుదల అయ్యి సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే.ఈ సినిమా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ ని సాధించడంతో అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతోంది? దాని బడ్జెట్ ఎంత అన్న విషయాలపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.

ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్( Trivikram ) కాంబినేషన్లో ఒక మైథలాజికల్ టచ్ మూవీ డైలాగ్ వెర్షన్ జరుగుతోంది.

దాంతో పాటు ఎవరు టెక్నీషియన్లు, సీజి వర్క్‌కు ఎవరు బెటర్ అన్న డిస్కషన్లు జరుగుతున్నాయి.కానీ ఈ సినిమాతో పాటు, ఈ సినిమా కన్నా ముందుగా విడుదల చేయడానికి వీలుగా మరో సినిమా చేయాలన్నది హీరో బన్నీ ఆలోచన.

Allu Arjun And Atlee Remuranation Problem Details, Allu Arjun, Tollywood, Atlee,

అందుకోసమే సన్ పిక్చర్స్ నిర్మాతగా, అట్లీ( Atlee ) డైరెక్షన్‌ లో సినిమా అనే దాన్ని ఫైనల్ లిస్ట్‌ లోకి చేర్చారు.అంతవరకూ బాగానే ఉన్న, కానీ అది అనౌన్స్మెంట్ వరకు రాలేదట.అయితే ఇందుకు గల కారణం కమర్షియల్స్ తేలకపోవడమే అని తెలుస్తోంది.

పుష్ప 2( Pushpa 2 ) సినిమాకు బన్నీ టోటల్ మార్కెట్ అమౌంట్‌ లో 27 శాతం తీసుకున్నారని వార్తలు ఉన్నాయి.అంటే దాదాపు 250 కోట్లకు పైగా.

Advertisement
Allu Arjun And Atlee Remuranation Problem Details, Allu Arjun, Tollywood, Atlee,

కానీ ఈ సినిమాకు ఎంత ఉండాలో అనే క్వశ్చన్ ఉంది.అట్లీ కూడా ఇప్పుడు పాన్ ఇండియా దర్శకుడు.

100 కోట్లకు కాస్త దగ్గరగా కోట్ చేస్తారు రెమ్యూనిరేషన్.

Allu Arjun And Atlee Remuranation Problem Details, Allu Arjun, Tollywood, Atlee,

బన్నీకి రెండు వందల కోట్లు ఇచ్చి, అట్లీకి 100 కోట్లు ఇస్తే రెమ్యూనిరేషన్లు అన్నీ కలిపి మూడు వందల యాభై కోట్ల మేరకు చేరిపోతాయి.ఇక ప్రొడక్షన్ ఖర్చు ఎంత, మార్కెట్ ఎంత అన్న లెక్కలు ఉంటాయి.ఇప్పుడు ఇవే డిస్కషన్లలో వున్నాయని, అవి వన్ ఫిక్స్ అయితే అప్పుడు ప్రాజెక్ట్ ఫైనల్ అవుతుందని తెలుస్తోంది.

దీంతో ఈ విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.అల్లు అర్జున్ తదుపరి సినిమా పుష్ప 2 కి మించి ఉంటుందని తెలుస్తోంది.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

మరి ఆ రేంజ్ లో ఖర్చు చేయగల నిర్మాతలు దొరుకుతారా లేదా అన్నది చూడాలి మరి.

Advertisement

తాజా వార్తలు