ఒక్క వీడియోతో అంచనాలు పెంచేసిన బన్నీ అట్లీ.. మూవీ ఇండస్ట్రీ హిట్ అయ్యే ఛాన్స్!

అల్లు అర్జున్ (allu arjun )ఇటీవల పుష్ప 2(Pushpa 2) సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

దాదాపుగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డులు.ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ మరింత పెరిగింది.

దీంతో అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాపై కూడా అంచనాలు భారీగా పెరిగాయి.ఇకపోతే పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో (Allu Arjun directed by Atlee)ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.అయితే ఈరోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఏవైనా అప్డేట్ విడుదల చేస్తారేమో అని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.

Advertisement
Allu Arjun And Atlee Movie Expeations Increse, Allu Arjun, Atlee Movie, Expeatio

అయితే ఎట్టకేలకు అభిమానులు ఎదురుచూసినట్టుగా ఈ సినిమా చిన్న వీడియో బైట్ ఒకటి వైరల్ అవుతోంది.ఈ చిన్న వీడియోలు అల్లు అర్జున్ అట్లీ సినిమాలపై అంచనాలను భారీగా పెంచేసింది.

పుష్ప 2 తరువాత బన్నీ చేయబోతున్న సినిమా కావడంతో అంచనాలు మరింత పెరిగాయి.అయితే అట్లీతో సినిమా అంటే ఏదో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ అనుకున్నారు.

కాదు బోలెడు గ్రాఫిక్స్ సిజి వర్క్ వుంటాయని ముందు నుంచి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

Allu Arjun And Atlee Movie Expeations Increse, Allu Arjun, Atlee Movie, Expeatio

కాగా సన్ పిక్చర్స్ భారీ వ్యయంతో నిర్మించే ఈ సినిమా ప్రకటన విడియోను కొంత మేరకు లాస్ ఏంజెల్స్ (Los Angeles)లోని గ్రాఫిక్స్ స్టూడియోలో చిత్రీకరించారు.అక్కడి నిపుణులతో బన్నీ, అట్లీ మాట్లాడిన సన్నివేశాలను రికార్డు చేసారు.రకరకాల క్రీచర్స్, గన్స్ ఇలా చాలా విషయాలు వీడియోలోకి తెచ్చారు.

చెవిటి వారు కాకూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

అంతే కాదు, కథ అదిరిపోయిందని అక్కడి నిపుణులు చెప్పిన మాటలను సైతం రికార్డు చేసారు.దీంతో బన్నీ ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేసాయి.

Advertisement

సినిమా నెక్ట్స్ లెవెల్ లో వుండబోతోందని అర్థం అయిపోయింది.ఇప్పటి నుంచే సినిమా మీద అంచనాలు పెరిగిపోతున్నాయి.

రాజమౌళితో సినిమా చేయకుండానే, ఆ రేంజ్ కు చేరుకున్న హీరోగా బన్నీకి పేరు ఇప్పటికే వచ్చింది.ఇప్పుడు సిజి వర్క్ లతో కూడిన భారీ సినిమా చేసి ఆ పేరును మరింత పెంచుకోబోతున్నాడని అర్థం అయింది.

అలా ఒక్క చిన్న వీడియోతో అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

తాజా వార్తలు