అల్లు అరవింద్ వేలు పెట్టడం లేదు ఈసారి

స్టార్ స్టేటస్ ఉంది కాబట్టి బయట జనాలు మెగాఫ్యామిలి మొత్తానికి చిరంజీవి పెద్ద దిక్కు అని అనుకుంటారేమో కాని, ఇండస్ట్రీ జనాలకు తెలిసిన నిజం ఏమిటంటే, మెగాఫ్యామిలి మొత్తాన్ని వెనక ఉండి నడిపించే శక్తి అల్లు అరవింద్.

థియేటర్లు బుక్ చేయడం, పంపిణిదారులను డిసైడ్ చేయడం వరకే కాదు, మెగా సినిమాల టెక్నికల్ విషయాల్లో కూడా అల్లు అరవింద్ చేయి ఉంటుంది.

కాని ధృవకి అలా జరగట్లేదు.పవన్ కళ్యాణ్ లాంటి హీరో, త్రివిక్రమ్ లాంటి దర్శకుడు ఉన్నా కూడా, జల్సా సినిమా ఎడిటింగ్ సమయంలో ఓ సీనీవిమర్శకుడిలా స్టూడియోలో కూర్చున్న అల్లు అరవింద్, ధృవ సినిమాకి మాత్రం అలాంటి వేలు పెట్టే పనులు చేయట్లేదట.

ఎడిటింగ్ రూమ్ కి ఆయన ఇప్పటివరకు వచ్చిన సందర్భాలు వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు అని, సినిమా నిర్మించి కూడా, టెక్నికల్ విషయాల్లో తలదూర్చకుండా దూరంగా ఉంటున్నారని టాక్.మరి అల్లు అరవింద్ అల్లుడు రామ్ చరణ్ మీద నమ్మకంతో ఎడిటింగ్ కి తనకే వదిలేశారో, లేక రామ్ చరణ్ మామ చేయి తన సినిమా మీద పడకుండా అడ్డుకుంటున్నాడో తెలియాలి.

Hell Spin CA Review And Player Reputation : Platform Mechanics And Banking
Advertisement