గేమ్ ఛేంజర్ మూవీపై అల్లు అరవింద్ పరోక్షంగా సెటైర్లు వేశారా.. అసలేం జరిగిందంటే?

టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు( Dil Raju ) నిర్మించిన రెండు సినిమాలు తాజాగా సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన విషయం తెలిసిందే.

అవి సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్ సినిమాలు.

అయితే ఇందులో గేమ్ ఛేంజర్ పాన్ ఇండియాగా భారీ బడ్జెట్‌ తో నిర్మించాడు.కానీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాను ( Sankranti vastunnam )లిమిటెడ్ బడ్జెట్‌ తో లోకల్‌ గా తీశాడు.

గేమ్ ఛేంజర్ ఫలితం కాస్త తేడా కొట్టేసింది.ఇక ఇలా తేడా కొట్టిన మూవీని పూర్తిగా గాలికి వదిలేశాడు దిల్ రాజు.

కానీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మంచి టాక్ రావడం, బ్లాక్ బస్టర్ వసూళ్లను సాధిస్తుండటంతో తన ఫోకస్ అంతా కూడా ఈ మూవీ మీదే పెట్టేశాడు.ఈవెంట్ల మీద ఈవెంట్లు పెడుతూనే ఉన్నాడు.

Allu Aravind Satires On Dil Raju Game Changer At Thandel Event, Allu Aravind, Di
Advertisement
Allu Aravind Satires On Dil Raju Game Changer At Thandel Event, Allu Aravind, Di

ప్రతీ చోటా సంక్రాంతికి వస్తున్నాం సినిమాను లేపే ప్రయత్నం చేస్తూనే వచ్చాడు.దిల్ రాజు తానేదో గేమ్ ఛేంజర్‌ ( game changer )తో పూర్తిగా బావిలో పడిపోయినట్టు కలరింగ్ ఇస్తూ వచ్చాడు.కానీ గేమ్ ఛేంజర్ విషయంలో మొత్తం పెట్టుబడి పెట్టింది జీ స్టూడియోస్( Zee Studios ) అని అంటున్నారు.

ప్రొడక్షన్ చేసి పెట్టినందుకు ఇంకా తిరిగి దిల్ రాజుకే చెల్లించారని చెబుతున్నారు.దిల్ రాజు మాత్రం గేమ్ ఛేంజర్‌ తో పూర్తిగా తాము మునిపోయామన్నట్టుగా పరోక్షంగా చెబుతూ వస్తున్నారు.

సంక్రాంతికి వస్తున్నాం సినిమా లేకపోతే తాము లేమని, తమ సంస్థ నిలబడేది కాదన్నట్టుగా ప్రెస్ మీట్లలో చెబుతున్నారు.అయితే దిల్ రాజు ఈ సంక్రాంతికి చేసిన హడావిడికి అతనితో పాటుగా మరి కొంత మంది నిర్మాతల ఇళ్లలో కూడా ఐటీ రైడ్స్ జరిగిన విషయం తెలిసిందే.

ఈ విషయాలపై టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స్పందిస్తూ కౌంటర్లు వేశారు.

Allu Aravind Satires On Dil Raju Game Changer At Thandel Event, Allu Aravind, Di
ఎన్టీఆర్ నీల్ మూవీ రిలీజ్ డేట్ విషయంలో పొరపాటు చేశారా.. అసలేం జరిగిందంటే?
సందీప్ రెడ్డి వంగ అల్లు అర్జున్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడానికి కారణం ఇదేనా..?

ప్రస్తుతం తండేల్ సినిమా ప్రమోషన్స్( Tandel Movie Promotions ) కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ఈవెంట్ కోసం దిల్ రాజు వచ్చాడు.దిల్ రాజుకి ఇంట్రడక్షన్ ఇస్తూ అరవింద్ గేమ్ ఛేంజర్‌ ను తక్కువ చేసి మాట్లాడుతూ తెగ నవ్వేశాడు.

Advertisement

ఈ సంక్రాంతికి దిల్ రాజు రెండు సినిమాలతో వచ్చాడని, ఒకటి కింది స్థాయిలో ఉంటే మరొకటి పై స్థాయిలో నిలబెట్టాడని చేతి సైగలతో చూపిస్తూ నవ్వేశాడు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

గేమ్ ఛేంజర్ పోయినందుకు అల్లు అరవింద్‌ కు హ్యాపీగానే ఉన్నట్టుందే అంటూ నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు.అల్లు అరవింద్ ఫై చెర్రీ అభిమానులు మండి పడుతున్నారు.

తాజా వార్తలు