మెగాస్టార్ చిరంజీవి ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఆయన కష్టం ఎంతో ఉందనే సంగతి తెలిసిందే.
స్టార్ స్టేటస్ ను అందుకోవడం కోసం చిరంజీవి నిద్రలేని రాత్రులు గడిపిన సందర్భాలు సైతం ఉన్నాయి.
కథల ఎంపికలో మిగతా హీరోలకు భిన్నంగా వ్యవహరించడం, ప్రయోగాత్మక కథలకు అంగీకరించడం, అద్భుతమైన డైలాగ్ డెలివరీ, కళ్లు చెదిరేలా డ్యాన్స్ స్టెప్పులు వేయడం చిరంజీవి సక్సెస్ కు కారణమని చాలామంది చెబుతున్నారు.అయితే తాజాగా చంద్రమోహన్ చిరంజీవి సక్సెస్ గురించి కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అల్లు అరవింద్ లేకపోతే చిరంజీవి ఈ స్థాయికి చేరుకోలేరని కొంతమందిలో భావన ఉంది.అయితే చంద్రమోహన్ కూడా తాజాగా ఇదే తరహా కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తనకు ఎవరి సపోర్ట్ లేదని అందుకే స్టార్ స్టేటస్ రాలేదని ఆయన అన్నారు.చిరంజీవికి అల్లు అరవింద్ సపోర్ట్ ఉన్న విధంగా తనకు కూడా సపోర్ట్ ఉండి ఉంటే బాగుండేదని చంద్రమోహన్ అభిప్రాయపడ్డారు.
కృష్ణుడు లేకపోతే అర్జునుడు వృథా అని చెబుతూ అల్లు అరవింద్ ను కృష్ణునితో చిరంజీవిని అర్జునునితో పోల్చడం గమనార్హం.అల్లు అరవింద్ లేకపోతే చిరంజీవికి కెరీర్ లేదనే విధంగా కామెంట్లు చేయడం హాట్ టాపిక్ అవుతోంది.
చిరంజీవి ఎలాంటి వేషాలు వేయాలో ఎంత రెమ్యునరేషన్ తీసుకోవాలో ఏ బ్యానర్లలో నటించాలి అనే విషయాలను అల్లు అరవింద్ చూసుకున్నారని ఈ విధంగా చిరంజీవి సక్సెస్ కు అల్లు అరవింద్ కారణమయ్యారని చంద్రమోహన్ అభిప్రాయపడ్డారు.ఆయన కామెంట్లపై నెటిజన్ల నుంచి భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.వైరల్ అవుతున్న కామెంట్ల గురించి చిరంజీవి, అల్లు అరవింద్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
చిరంజీవి ప్రస్తుతం పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy