బన్నికి న్యాయం, చరణ్ కి అన్యాయం చేస్తున్న అల్లు అరవింద్

సరైనోడు బాక్సాఫీసు కలెక్షన్ల మీద ఇప్పటికి ట్రేడ్ ప్రపంచంలో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతాయి.ఈ సినిమా కలెక్షన్ల రిపోర్టులపై ఎన్నో అనుమానాలు.

సొంత సినిమాలని గీత ఆర్ట్స్ రెండు మూడు ఏరియాల్లో అయినా సొంతంగా పంపిణి చేస్తుంది.తాము నడిపిస్తున్న ఏరియాలతోపాటు ట్రాకింగ్ సరిగా లేని ఏరియాల్లో కలెక్షన్లు పెంచి చెప్పడం అల్లు అరవింద్ కి అలవాటు అనే ఆరోపణ కూడా ప్రచారంలో ఉంది.

ముఖ్యంగా సరైనోడు సినిమాకి సంబంధించి కర్ణాటక కలెక్షన్లు బాగా పెంచి చెప్పారని, ఇక్కడి బయ్యర్లకి నష్టాలు వస్తోంటే, సినిమాకి లాభాలు వచ్చినట్లు మీడియాలో ప్రచారం చేయించారని, అప్పట్లో కర్ణాటకకు చెందిన ఒక లోకల్ పంపిణిదారుడు తీవ్రమైన ఆరోపణలు చేసాడు.ఇప్పుడు అదే పంపిణిదారుడు మరోసారి అల్లు అరవింద్ పై విరుచుకుపడుతున్నాడు.

తన కొడుకు సినిమా కోసం, ఇమేజ్ కోసం కలెక్షన్లు పెంచి చెప్పిన గీతా ఆర్ట్స్ అధినేత, తన అల్లుడి సినిమా విషయంలో మాత్రం అలా చెయ్యట్లేదు అని, బన్నికి పెంచి చెప్పి, కర్ణాటకలో బాగా ఆడుతున్న ధృవకి మాత్రం మామూలుగానే వచ్చిన కలేక్షన్లనే బయటకి చెబుతున్నారని, ఈరకంగా సొంత కొడుకుని ఓ రకంగా , అల్లుడిని మరోరకంగా అల్లు అరవింద్ చూస్తున్నారని ఆ బయ్యర్ యొక్క అభియోగం.ఇందులో నిజానిజాలు మనకు మాత్రం తెలియవు.

Advertisement

ధృవ మాత్రం కర్ణాటక నుంచి మంచి కలెక్షన్లు రాబడుతోంది.అది చాలు.

Advertisement

తాజా వార్తలు