సూర్యను చంపేయాలని చూస్తున్నది ఎవురు?

మెగా స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా అను ఎమాన్యూల్‌ హీరోయిన్‌గా తెరకెక్కిన ‘నా పేరు సూర్య’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది.

మే 4న విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక తాజాగా హైదరాబాద్‌లో జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రామ్‌ చరణ్‌ హాజరు కావడం జరిగింది.గత కొన్ని రోజులుగా మెగా ఫ్యామిలీ హీరోలపై, సినిమా పరిశ్రమపై న్యూస్‌ ఛానెల్స్‌ కాస్త అతిగా స్పందిస్తూ వార్త కథనాలు ప్రసారం చేస్తున్న విషయం తెల్సిందే.

ఆ విషయమై పవన్‌ కళ్యాణ్‌ పెద్ద నిరసన కార్యక్రమం తెలియజేయడంతో సినిమా పరిశ్రమ వారు న్యూస్‌ ఛానెల్స్‌పై చర్యలకు సిద్దం అవుతున్నాయి.

Allu Aravind Comments On Media Channels

ఇలాంటి సమయంలోనే ‘నా పేరు సూర్య’ చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమాలను టీవీ9కు ఇచ్చేది లేదు అంటూ తేల్చి చెప్పేసింది.కేవలం ఎన్‌టీవీకి మాత్రమే ఈ చిత్రం ప్రమోషన్‌ హక్కులు ఇవ్వడం జరిగింది.ఈ నేపథ్యంలో అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ఈ చిత్రంపై కుట్ర జరుగుతుంది.

Advertisement
Allu Aravind Comments On Media Channels-సూర్యను చంపేయ�

ఈ చిత్రాన్ని నాశనం చేసేందుకు, బ్యాడ్‌ టాక్‌ను తెచ్చేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు.ఆ విషయం నాకు ఇటీవలే తెలిసింది.

ఈ విషయాన్ని నీకు తర్వాత చెబుతాను అంటూ బన్నీని ఉద్దేశించి అనడం జరిగింది.కొన్ని న్యూస్‌ ఛానెల్స్‌పై గత కొన్ని రోజులుగా మెగా ఫ్యామిలీ చిన్నపాటి యుద్దమే చేస్తోంది.

ఆ కారణంగానే వారు ఈ చిత్రాన్ని నాశనం చేయాలని భావిస్తు ఉండవచ్చు అనేది కొందరి అనుమానం.అల్లు అరవింద్‌ నేరుగా పేరు ప్రస్థావించకుండా కొందరు సినిమాను చంపేయాలని చూస్తున్నారు అంటూ వ్యాఖ్యనించడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది.

అల్లు అర్జున్‌ సినిమాపై భారీ క్రేజ్‌ ఉంది.ఆ క్రేజ్‌ను తగ్గించడంతో పాటు, సినిమా స్థాయిని తగ్గించి కొన్ని కథనాలు ప్రసారం చేయడం వల్ల ప్రేక్షకుల్లో మరియు అభిమానుల్లో కాస్త అనుమానం మొదలవుతుంది.

వారానికి ఒకసారి ఈ మ్యాజికల్ ఆయిల్ ను వాడారంటే 60 లోనూ మీ జుట్టు నల్లగానే ఉంటుంది!

అలా అయితే ఓపెనింగ్స్‌పై భారీ ప్రభావం ఉండే అవకాశం ఉంది.ఈ విధంగా సినిమాను కిల్‌ చేస్తున్నారంటూ మెగా వర్గాల వారు చెబుతున్నారు.

Advertisement

అయితే ఈ విషయమై సదరు న్యూస్‌ ఛానెల్స్‌ వారు ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ ఆర్మీ ఆఫీసర్‌గా నటించాడు.

అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఈ చిత్రంలో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కూడా ఉంటాయని సినిమా ట్రైలర్‌ చూస్తుంటే అర్థం అవుతుంది.అల్లు అర్జున్‌కు గత కొంత కాలంగా వరుస సక్సెస్‌లు పడుతున్నాయి.

అందుకే ఈ చిత్రం కూడా తప్పకుండా విజయాన్ని అందుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.మే 4న విడుదల కాబోతున్న ఈ చిత్రం భారీ వసూళ్లను సాధిస్తుందా లేక అల్లు అరవింద్‌ అన్నట్లుగా కొందరి చేతిలో ఈ చిత్రం చనిపోతుందా అనేది చూడాలి.

తాజా వార్తలు