Hero Yash : కేజీఎఫ్ మూవీ రిలీజ్ కు ముందు యశ్ ఎవరు.. వైరల్ అవుతున్న అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు!

తెలుగు సినీ ప్రేక్షకులకు కన్నడ స్టార్ హీరో యశ్( Hero Yash ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

యశ్ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా కేజిఎఫ్.

ఈ సినిమాతో రాత్రికి రాత్రే పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు యశ్.కాగా కేజిఎఫ్ పార్ట్ 1, పార్ట్ 2 సినిమాలు విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించాయో మనందరికీ తెలిసిందే.బాక్సాఫీస్ ( box office )వద్ద సంచలన విజయాన్ని అందుకోవడంతో పాటు కలెక్షన్ల సునామీని సృష్టించాయి.

ఇకపోతే అసలు విషయంలోకి వెళితే హీరో యశ్ కేజిఎఫ్ సినిమా ముందు వరకు ఎవరు అన్న విషయం చాలామందికి తెలియదు.ఈ మాట యశ్ అభిమానులకు కోపం తెప్పించినప్పటికీ ఇది వాస్తవం.

తాజాగా ఇదే విషయాన్ని మరోసారి టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్( Allu Arvind ) కూడా స్పష్టం చేశారు.తాజాగా హైదరాబాద్‌లో జరిగిన కోటబొమ్మాళి పీఎస్ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు అల్లు అరవింద్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Advertisement

రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ( Rahul Vijay , Shivani Rajasekhar )ప్రధాన పాత్రలుగా శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్‌ కుమార్ కీలకపాత్రలు పోషించిన చిత్రం కోట బొమ్మాళి పీఎస్‌.తేజ మార్ని ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన లింగి లింగి లింగిడి అనే ఫోక్‌ సాంగ్‌కు భారీగా రెస్పాన్స్ వచ్చింది.

అంతే కాకుండా ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతూ దూసుకుపోతోంది.

సోమవారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్స్‌లో టీజర్‌‌ లాంచ్( Prasad Labs ) ఈవెంట్‌ను నిర్వహించారు.దర్శకుడు అనిల్ రావిపూడి( Anil Ravipudi ) ఈ చిత్ర టీజర్‌‌ను రిలీజ్ చేశారు.టీజర్ లాంచ్ అనంతరం చిత్ర యూనిట్ మీడియా ప్రతినిధులతో ముచ్చటించింది.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!

ఈ ప్రెస్ మీట్‌లో అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు.అయితే, గీతా ఆర్ట్స్ సంస్థ నుంచి చిన్న చిన్న సినిమాలు తప్ప పెద్ద సినిమాలు ఎందుకు రావడం లేదని అల్లు అరవింద్‌కు ప్రశ్న ఎదురైంది.

Advertisement

దీనికి అల్లు అరవింద్ స్పందిస్తూ.నిర్మాణ వ్యయమే కారణమనీ తెలిపారు.

హీరోల రెమ్యూనరేషన్ విషయం గురించి మాట్లాడుతూ.హీరోల రెమ్యూనరేషన్ ఎంత ఉంది అన్న విషయం గురించి ఆలోచించండి అని చెబుతూనే కొన్ని సినిమా నిర్మాణ వ్యయాలు ఎంతున్నాయో మీరు గమనించండి.

 ఆ వ్యయంలో హీరోల రెమ్యునరేషన్లు ఎంతున్నాయో మీరు లెక్కేసుకోండి.తక్కువే ఉన్నాయి.

హీరోల వల్ల నిర్మాణ వ్యవయం పెరిగిపోయి నిర్మాతలు అంతా దూరంగా ఉంటున్నారు అని అనడం కరెక్ట్ కాదు.ఇవాళ పెద్దగా చూపిస్తే తప్ప పెద్ద సినిమాలను ఆదరించరు.

హీరోలతో సంబంధం లేకుండా సినిమాను పెద్దగా చూపించాలి.కె.జి.యఫ్ రాకముందు అతను హీరో యశ్ ఎవరండి? ఎంత పెద్ద హీరో అతను? సినిమాను పెద్దగా చూపించారు కాబట్టే ఆ సినిమా ఆడింది.ఇది ఒక ఉదాహరణ మాత్రమే అని అల్లు అరవింద్ తెలిపారు.

తాజా వార్తలు