ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికలలో బిజెపి తమ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ను ఎంపిక చేసింది.
మొదటి నుంచి ఈమె పేరునే బిజెపి తరఫున ప్రకటిస్తారని ప్రచారం జరిగింది.
దానికి తగ్గట్లుగానే ఫైనల్ అయింది.అంతకుముందు ఉపరాష్ట్రపతి గా ప్రస్తుతం ఉన్న వెంకయ్యనాయుడు ను రాష్ట్రపతి గా ప్రకటిస్తారని అంతా భావించినా, ద్రౌపది ముర్ము ను ఫైనల్ చేశారు.
ఈ మేరకు బీజేపీ పార్లమెంటరీ బోర్డులో అధికారికంగా బిజెపి రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం కమిటీలను నియమించారు.అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని చివరగా ద్రౌపది ముర్ము ను తమ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది.
అయితే ఈమె ఎంపిక విషయంలో చాలా రాజకీయ లెక్కలను పరిగణనలోకి తీసుకుని బిజెపి ఈమె పేరును ఫైనల్ చేసింది.ఈమె గిరిజన వర్గానికి చెందిన వారు కావడంతో, ఆదివాసీలు బిజెపి పక్షాన భవిష్యత్తులో నిలబడతారని అంచనా వేసి ఈమె ఎంపికను ఫైనల్ చేసినట్లు గా కనిపిస్తున్నారు.
అలాగే ఈ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి విజయానికి ఎటువంటి డోకా లేకుండా పూర్తి చేశారు .విపక్షాలు సైతం ఈమెకు మద్దతు తెలపాల్సిన పరిస్థితి ఏర్పడింది.బిజెపి ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టిఆర్ఎస్ సైతం ఆదివాసీల ఓట్ల దృష్ట్యా ఈమెకే మద్దతు తెలిపే అవకాశం కనిపిస్తోంది.
రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక సంబంధించి దాదాపు 20 మంది పేర్లను పరిశీలించిన తరువాత ద్రౌపది ముర్ము పేరును ఫైనల్ చేశారు.
బిజెపి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము కు 64 ఏళ్లు.ఉపాధ్యాయురాలిగా జీవితం ప్రారంభించిన ఆమె, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు.ఒడిస్సా లో ఎమ్మెల్యేగా గెలవడం తోపాటు మంత్రిగా పనిచేశారు.
ఆ తర్వాత ఝార్ఖండ్ గవర్నర్ గా పని చేశారు.వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉండే ఈమెనే బీజేపీ వ్యూహాత్మకంగా ఎంపిక చేయడం తో, ఈమె గెలుపునకు ఎటువంటి డొఖా లేదు అనే విషయం అర్ధం అవుతోంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy