అభ్యర్థుల ఎంపికపై మూడు పార్టీలదీ ఒకే నిర్ణయం !

తెలంగాణలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలపై మూడు ప్రధానుపార్టీలైన బీఆర్ఎస్,( BRS party ) కాంగ్రెస్, బిజెపిలు అనేక వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలకు గెలుపు అత్యంత ప్రతిష్టాత్మక కావడంతో, ఎవరికి వారు రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కేవలం కొద్ది నెలలు మాత్రమే సమయమే ఉంది.డిసెంబర్ రెండవ వారం లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లుగా సంకేతాలు వెలువడుతున్నాయి.

దీంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల్లో గెలుపు కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి.ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు  ప్రతి దశలోనూ ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఈ విషయంలో అధికార పార్టీ వైసిపి దూకుడుగా ఉంది.ఇటీవల అసెంబ్లీలో కేసీఆర్ సైతం కీలక ప్రకటన చేశారు.

Advertisement
All Three Parties Have The Same Decision On The Selection Of Candidates, Bjp, Te

విపక్షాలను ఎదుర్కొనేందుకు తన దగ్గర ఇంకా ఎన్నో అస్త్రాలు ఉన్నాయని అసెంబ్లీలోనే వ్యాఖ్యానించారు.ఇక ఇప్పటికే కాంగ్రెస్ అనేక డిక్లరేషన్లు ప్రకటించింది.

ప్రియాంక గాంధీ వస్తే మహిళా డిక్లరేషన్ వెల్లడించేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధం అవుతున్నారు.కర్ణాటకలో ప్రకటించినట్లుగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని ప్రకటించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది.

ఇదేవిధంగా ఎన్నికల వరకు అనేక హామీలను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది.ఇది ఇలా ఉంటే మూడు ప్రధాన పార్టీలు ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటించి, క్షేత్రస్థాయిలో అభ్యర్థులు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టే విధంగా అవకాశం ఇవ్వాలని భావిస్తున్నాయి.2018 లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి విపక్షాలకు అవకాశం లేకుండా  చేయగలిగారు.

All Three Parties Have The Same Decision On The Selection Of Candidates, Bjp, Te

ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక పైనా పూర్తిగా కేసిఆర్ ( CM kcr )దృష్టి సారించారు.ఇప్పటికే ఇంటెలిజెన్స్ నివేదికలు తెప్పించుకుంటూనే మరోవైపు అనేక సర్వే సంస్థ రిపోర్టులను పరిశీలిస్తున్నారు.గెలుపు అవకాశాలు ఉన్నవారికి టికెట్ కేటాయించాలని కెసిఆర్ నిర్ణయించుకున్నారు.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ టీమ్ రెండుసార్లు సర్వే చేయించినట్లు సమాచారం.ఈ సర్వేలో పనితీరు అంతంతమాత్రంగా ఉన్నవారిని తప్పించి, వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

ఆగస్టు 12 లేదా 13వ తేదీల్లో 87 సీట్లకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించేందుకు కేసిఆర్ సిద్ధమవుతున్నట్లుగా సమాచారం.

ఒకవేళ ఆ తేదీన కుదరకపోయినా, ఆగస్టు 17న జాబితాను వెల్లడించే అవకాశం ఉన్నట్లుగా బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.ఇక కాంగ్రెస్, బిజెపి సైతం అభ్యర్థుల ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నాయి.కాంగ్రెస్ ఎన్నికల కమిటీలో ఏకాభిప్రాయం కుదిరిన 35 నుంచి 45 మందితో ఉన్న జాబితాను ఆగస్టు చివరి వారంలో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.

హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా అనుసరించిన వ్యూహాన్ని తెలంగాణలోనూ అమలు చేసేందుకు కాంగ్రెస్ ( Congress party )ప్రయత్నిస్తోంది.ఇక బిజెపి( BJP party ) విషయానికి వస్తే 30 నుంచి 40 సీట్లకు అభ్యర్థులను ముందుగానే ప్రకటించాలని నిర్ణయించుకున్నారు.

ఈ మేరకు పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ ని బిజెపి అధిష్టానం ఢిల్లీకి పిలిపించుకుంది .బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ,బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ( Bandi Sanjay )ఎన్నికల కమిటీ అధ్యక్షుడు ఈటెల రాజేందర్, బిజెపి ఓబీసీ సెల్ చైర్మన్ డాక్టర్ కె లక్ష్మణ్, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మధ్య కుదిరిన ఏకాభిప్రాయం ప్రకారం అభ్యర్థుల జాబితాను ముందుగానే ప్రకటించేందుకు బిజెపి ప్లాన్ చేసుకుంటోంది.ఈ విధంగా మూడు ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపైనే దృష్టి పెట్టి ఈ నెలలోనే ఆ జాబితాను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి.

తాజా వార్తలు